పురుషాధిపత్యం...
డీ.హీరేహాళ్ :మహిళల రాజకీయ ఎదుగుదలకు భర్తలే అడ్డుగా నిలుస్తున్నారనేందుకు అద్దం పట్టింది బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాస్తూ ఎంపీపీ భర్త వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... ఎంపీపీ పుష్పావతికి మండల సమస్యలపై మంచి అవగాహన ఉంది. రాజకీయంగానూ ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఆమెను అసహాయురాలిగా చేస్తూ బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె భర్త మహాబలి అధ్యక్షురాలి సీటు పక్కనే తాను ప్రత్యేకంగా ఆసీనుడయ్యాడు. ప్రజాప్రతినిధులు సంధించిన ప్రతి ప్రశ్నకూ తానే ఎంపీపీ అనే రీతితో సమాధానమిస్తూ అధికారులను సైతం డమ్మీలుగా మార్చేశాడు. భర్త ఆగడాన్ని ఎమ్పీపీ మౌనంగా భరిస్తూ వచ్చారు.