పాజిటివ్ డెంటిస్ట్
ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటి?
ఎత్తు పళ్ళ సమస్యను సరిచేయుటకు సంబంధించిన బ్రాంచ్ని ఆర్థోడాంటిక్స్ అంటారు. దీనిలో వంకరపళ్ళను కూడా సరిచేయవచ్చు.
ఎత్తుపళ్ళ సమస్యను ఎలా అరికట్టవచ్చు?
ఎత్తు పళ్ళ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక ఎక్స్‌రే తీయవలసి ఉంటుంది. దానివల్ల ఎత్తు పళ్ళ సమస్య దంతాలకు సంబంధించినదా లేక ఎముకకు సంబంధించినదా అని నిర్థారిస్తారు. అది ఎముకలకు సంబంధించినదైతే స్కెలిటల్ ఎనామలీ అంటారు. ఒకవేళ స్కెలిటల్ ఎనామలీ అయితే ఆర్థోగ్నాతిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది.
ఎత్తు పళ్ళను ఆర్థో ద్వారా సరిచేయుటకు ఎంత కాలం పడుతుంది?
ఇది నిర్థారించుటకు రెండు ఎక్స్‌రేలు తీయవలసి ఉంటుంది. ఒకటి - ఆర్థోపెంటమొగ్రామ్. రెండవది - లెటరల్ సెఫలోగ్రామ్. దాన్ని బట్టి నిపుణులు ఎంతకాలం పడుతుందో నిర్థారిస్తారు.
ఆర్థోడాంటిక్ ప్రొసీజర్ని ఎలా చేస్తారు?
దీనికి ముందుగా ఒక పళ్ళ నమునా తీసి మోడల్ ఎనాలిసిస్ చేస్తారు. దానివల్ల పళ్ళు తీయవలసిన అవసరం ఉంటుందా లేదా అని నిర్థారిస్తారు. తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాని తరువాత బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. కాంపోసిట్ అనే మెటీరియల్‌తో బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. ఈ ప్రాసెస్‌ని బౌండింగ్ అంటారు. దీనికి ఒక గంట సమయం పడుతుంది. దాని తరువాత నెలకి ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి.
ఆర్థోడాంటిక్ బ్రెసెస్ ఎన్ని రకాలు ఉంటాయి?
స్టెన్‌లెస్ స్టీల్ బ్రెసెస్ ఒక రకం. ఇప్పుడు ఆధునికంగా వచ్చిన వాటిలో సిరమిక్ బ్రెసెస్ ఒకటి. ఇందులో బ్రెసెస్ పళ్ళ రంగులో ఉంటాయి.
దీనివల్ల బ్రెసెస్ పెట్టినట్టు కనిపించవు. ఇంకో ఆధునిక పద్ధతి ఏమనగా లింగువల్ ఆర్థోడెంటెక్స్. దీనిలో బ్రెసెస్ పంటి మీద అంటే పంటి ముందు భాగం మీద కాకుండా వెనుక భాగంలో అమర్చుతారు. దానివల్ల బ్రెసెస్ అసలు కనబడవు.
ఒకసారి ఎత్తుపళ్ళు సరిచేసిన తరువాత తిరిగి యథాస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుందా?
ఇది జరుగకుండా ఉండడానికి ఆర్థోట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే రీటేనర్స్ ఇస్తారు. రీటేనర్స్ రెండు రకాలు ఉంటాయి.
ఒకటి రీమూవబుల్, ఇంకొకటి ఫిక్సెడ్. దీనిని ఆరు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల ఎత్తు పళ్ళు తిరిగి వచ్చే సమస్య అనగా రిలాప్స్ని నివారించవచ్చు.
ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏ వయస్సు వారికి చేయవచ్చు?
పదిహేనేళ్ళు దాటిన తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.
డా. సృజనారెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్
www.positivedental.com
హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్
దిల్సుఖ్నగర్, మాదాపూర్, కెపిహెచ్బి, నిజాంపేట, కర్నూల్
9246567874