డాబర్మెన్కు ఒకేసారి 14 పిల్లలు
డాబర్మెన్ జాతికి చెందిన ఓ కుక్క ఒక ఈతలో 14 కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండల కేంద్రానికి చెందిన ముట్లూరు రాజు కుంటుంబ సభ్యులు వివిధ రకాల జాతి కుక్కలను పెంచుతున్నారు. వీటిల్లో డాబర్మెన్ జాతి కుక్క శనివారం రాత్రి రెండో ఈతలో 14 పిల్లలకు జన్మనిచ్చింది. కుక్క పిల్లలన్నీ ఆరోగ్యగా ఉన్నాయి. ఇదే కుక్క మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మినిచ్చింది. స్థానిక పశువైద్యాధికారి బి.సాంబశివరెడ్డి మాట్లాడుతూ... ఒకే ఈతలో ఏడెనిమిది పిల్లలు పుట్టడం సహజమేనని, 14 కుక్క పిల్లలు పుట్టడం అరుదుగా జరుగుతుందని తెలిపారు.