స్టాక్ మార్కెట్లో డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి?
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధమైన డబ్బా ట్రేడింగ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా పేర్కొంది. స్టాక్ ఎక్ఛేంజీ ప్లాట్‌ఫామ్‌తో సంబంధంలేకుండా బయట షేర్లలో లావాదేవీలు చేపట్టడాన్ని డబ్బా ట్రేడింగ్‌గా వ్యవహరిస్తారు. ఇది చట్టవిరుద్ధంకాగా.. కొంతమంది ఆపరేటర్లు ఇలాంటి ట్రేడింగ్ రింగ్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఇతరులను అనుమతిస్తారు.
వెరసి ఇలాంటి లావాదేవీలపట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. డబ్బా ట్రేడింగ్‌ను నితిన్ శాంతీలాల్ నగ్డా, నరేంద్ర వి.సుమారియా ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీళ్లు ట్రేడింగ్ సభ్యులు(టీఎం)గా రిజిస్టర్కావడంతో అధీకృత వ్యక్తులు(ఏపీ)గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. వెరసి చట్టవిరుద్ధమైన ఎలాంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ లావాదేవీలు చేపట్టవద్దంటూ ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ హెచ్చరికలు జారీ చేసింది.
వీటికి ఇన్వెస్టర్లే బాధ్యత వహించడంతోపాటు.. నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలియజేసింది. ఇలాంటి లావాదేవీ లకు స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి ఎలాంటి అనుమతులు లభించవని స్పష్టం చేసింది.