అసిన్ ప్లాట్ వేలానికి కోర్టు ఆదేశం
నటి అసిన్ ప్లాట్ వేలానికి కోర్టు ఆదేశించింది. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా వెలుగొందిన నటి అసిన్. గజనీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత దక్షిణాదిపై దృష్టి సారించారు. అసిన్‌కు ప్రస్తుతం బాలీవుడ్లో అవకాశాలు అంతంతమాత్రమే. కాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని రవిపురంలో అసిన్‌కు డబుల్‌బెడ్ రూం ఫ్లాట్ ఉంది. దీని అలంకార బాధ్యతల్ని కొచ్చికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ తీసుకుంది. అందుకుగాను రూ.పది లక్షలు ఖర్చయినట్టు సమాచారం.
ఈ మొత్తాన్ని అసిన్ చెల్లించ పోవడంతో ఆ సంస్థ నిర్వాహకురాలు జయలక్ష్మి ఎర్నాకులం న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయ స్థానం ఈ నెల 14వ తేదీలోపు పది లక్షల రూపాయలు కోర్టులో చెల్లించాలని ఆదేశించింది. చెల్లించని యెడల, ఆమె ఇంటిని వేలం వేయాలని పేర్కొంది.