Dadabhai Naoroji
-
తొలి భారతీయుడు! అమిత సత్యవాది
‘‘సుసంపన్నమయిన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదా?’’ అన్నది నౌరోజీ సూటి ప్రశ్న. ఆయన ప్రసంగ సారాంశమే తర్వాత కాలంలో ఓ సిద్ధాంతంగా సుప్రసిద్ధమయింది! భారత రాజకీయాల్లో నౌరోజీ మితవాదే అయివుండొచ్చు కానీ, మౌలికంగా ఆయన సత్యవాది కూడా! ఈ రోజున వలసవాదం గురించి తెలియని వాళ్ళూ లేరు. వాళ్ళకు ‘‘వలసదేశాల నుంచి సంపద తరలింపు’’ గురించి నోరుపడిపోయేంతగా వివరించి చెప్పాల్సినంత అగత్యమూ లేదు! ఎవడో రడ్యార్డ్ కిప్లింగ్ – ఎంత నోబెల్ లారియేట్ అయినప్పటికీ తెల్ల జాతి జింగోయిజం ప్రదర్శించి వైట్‌మ్యాన్స్ బర్డెన్ అంటూ ఏదో రాస్తే ‘‘ఆయన భావప్రకటన సౌకుమార్యాన్ని’’ నెత్తినేసుకుని కీర్తించడానికి ఇవాళ ఎవరూ సిద్ధంగా లేరు! అలాగే, ఎవడో రాబర్ట్ సెసిల్ అనే శాలిస్బరీ ప్రభువు – ఎంత బ్రిటన్ ప్రధానమంత్రి అయినప్పటికీ నౌరోజీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఓ నల్లవాణ్ణి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడిగా ఆమోదించేంత స్థాయికి మన జాతి ఎదగలే’’దని వ్యంగ్య విభవం ఒలకపోస్తే ‘‘ఆహా ఏం చమత్కారం గురూ!’’ అంటూ చప్పట్లు కొట్టేవాళ్ళు ఆ దేశాల్లోనే లేరిప్పుడు!! రేపోమాపో అటు అమెరికాలోనూ ఇటు బ్రిటన్ లోనూ కూడా భారతీయ వంశాంకురాలు – అందునా మహిళలు – ముఖ్య పదవులు గెల్చుకున్నా విస్తుపోనవసరం లేదు – అలాగే, మీసాలు మెలేయాల్సిన అవసరమూ లేదు!! పోతే, మనం కాలేజీల్లో చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో నౌరోజీ ప్రతిపాదించిన ‘‘వలసల సంపద హరణం’’ సిద్ధాంతం గురించి ప్రముఖంగా ప్రస్తావించడం కద్దు. ఆ పుస్తకాలు రాసేవాళ్ళంతా వలసవాదాన్నీ, సామ్రాజ్యవాదాన్నీ, ఆ మాటకొస్తే వాటన్నిటికీ మూలమైన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించేవాళ్ళు కారుకదా! కానీ, వాళ్ళందరూ, ‘‘వలస దేశాల నుంచి సకల రూపాల్లో సంపద తరలించుకు పోయారు సుమా!’’ అని పాఠ్య గ్రంథాల్లో రాయక తప్పని పరిస్థితి ఏర్పడ్డానికి దాదాభాయ్ నౌరోజీ మొదలు నేటి శశి థరూర్ వరకూ ఎందరో కారకులు. చారిత్రక స్పృహ కలిగివుండడమంటే ఈ విషయాన్ని మర్చిపోకపోవడమే!! తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ తన తొంభయ్ రెండేళ్ళ సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఘనతలను సాధించి ఆయా రంగాల్లో ప్రథముడిగా నిలిచారు. తను చదువుకున్న ఒకానొక భారతీయ కళాశాలలో గణితశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే అధ్యాపకుడిగా నియమితుడైన తొలి భారతీయుడు నౌరోజీ. సహచర ఆచార్యుల నుంచి ‘‘భారతదేశ భవితవ్యం’’గా ప్రశంసలను అందుకున్న నౌరోజీ ఇరవయ్యేడో యేటనే రాజకీయరంగ ప్రవేశం చేశారు; మరో రెండేళ్ళలోనే రస్త్ గొఫ్తార్ (సత్యవాది) అనే ఆంగ్లో–గుజరాతీ పత్రికను ప్రారంభించారు; బ్రిటిష్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెల్చిన తొలి భారతీయుడు నౌరోజీ; కార్ల్ కౌట్స్కీ, గియోర్గియ్ ప్లెఖనోఫ్ తదితరుల నాయకత్వంలోని సెకండ్ ఇంటర్నేషనల్‌లో పాల్గొన్న తొలి (బహుశా ఏకైక) భారతీయుడు నౌరోజీ. ఆ వేదిక మీదనుంచే తొలిసారి ఆయన బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కొల్లగొడుతోందో గణాంక వివరాలతో సహా వెల్లడించారు. అప్పట్లో భారత జనాభా పాతిక కోట్ల మంది వుండేవారట. వాళ్ళ తలసరి వార్షిక ఆదాయం 27 రూపాయలని’’ ప్రభుత్వం ప్రకటించగా, నిజానికి ఆ మొత్తం 20 రూపాయలకు మించదని నౌరోజీ వాదించి రుజువు చేశారు! ‘‘సుసంపన్నమయిన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదా?’’ అన్నది నౌరోజీ సూటి ప్రశ్న. ఆయన ప్రసంగ సారాంశమే తర్వాత కాలంలో ఓ సిద్ధాంతంగా సుప్రసిద్ధమయింది! దాన్నే మనం కాలేజీల్లో చదువుకున్నాం. భారత రాజకీయాల్లో నౌరోజీ మితవాదే అయివుండొచ్చు కానీ, మౌలికంగా ఆయన సత్యవాది కూడా! లేనట్లయితే, గాలికి పోయే మీడియా ముళ్ళకంపను చెంగుకు తగిలించుకోవలసిన అవసరం ఏముంది? సరిహద్దులు చెరిపేశాడు! ‘లేడీ విద్ ఎ ల్యాంప్’గా ప్రసిద్ధురాలైన ఫ్లారెన్స్ నైటింగేల్, అమెరికన్ పరిశోధనాత్మక పాత్రికేయురాలు ఇడా వెల్స్, జాతిపరమైన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బ్రిటిష్ క్వేకర్ కార్యకర్త కేథరిన్ ఇంపీ, కార్ల్ మార్క్స్ ‘అదనపు విలువ సిద్ధాంతాలు’ సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించిన కార్ల్ కౌట్స్కీ, వి.ఐ.లెనిన్ తన రాజకీయ గురువుగా సంభావించిన గియోర్గియ్ ప్లెహనోఫ్, ఆఫ్రికన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడూ ట్రినిడాడ్‌కు చెందిన ప్రముఖ న్యాయవాదీ హెన్రీ సిల్విస్టర్ విలియవ్‌సు, అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త డబ్లు్య.ఈ.బీ.డ్యూబోయ్స్, ఘనా ప్రథమ నేత ఎన్ క్రుమా.. తదితరులతో నౌరోజీ –పందొమ్మిదో శతాబ్దిలోనే – స్నేహసంబంధాలు కలిగివుండడం ఆషామాషీ విషయం కాదు! ఒక చరిత్ర పరిశోధకుడి అంచనా మేరకు నౌరోజీ – లండన్‌లో వుండే రోజుల్లో – మార్క్స్‌ను కూడా కలిసేవుంటారు. అలాంటి అంతర్జాతీయస్థాయి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీలో మితవాదిగా మాత్రమే పరిగణించడం ఎంతవరకూ చారిత్రకమో నిపుణులు కనీసం ఇప్పుడయినా నౌరోజీ కన్నుమూసి నూట అయిదేళ్ళు కావస్తున్న తరుణంలోనయినా నిగ్గుతేల్చాలి! – మందలపర్తి కిషోర్ (చదవండి: మహోజ్వల భారతి: బంకిమ్ని బయటే నిలబెట్టేశారు!) -
Dadabhai Naoroji: భరతజాతి హితామహుడు
లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారు. అంతటి గురుతుల్యులకే గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ఏమిటి ఆయనలోని ప్రత్యేకత? విజ్ఞతా, మరేదైనా విలక్షణతా? ‘‘పిల్లలు తమ తండ్రి వైపు ఆశగా చూసినట్లుగా భారతీయులు మీ వంక చూస్తున్నారు; అదీ ఇక్కడ నెలకొని వున్న మనోభావ’’మన్నారట గాంధీజీ, దాదాభాయ్ నౌరోజీకి ఓ లేఖ రాస్తూ. లోకమాన్య బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలను గాంధీజీ గురుతుల్యులుగా భావించేవారని మనకు తెలుసు. వారిద్దరూ గురుపాదుడుగా సంభావించిన మేధావి దాదాభాయ్ నౌరోజీ! ‘‘ఘనమైన భారతీయ వృద్ధుడు’’గానూ, ‘‘అనధికార భారతీయ రాయబారి’’గానూ ఖండఖండాంతరాల్లో ప్రసిద్ధుడయ్యాడు నౌరోజీ. అల్పసంఖ్యాక వర్గమయిన పార్సీ (జొరాస్ట్రియన్) మతానికి చెందిన నౌరోజీ, విశాల విస్తృత జాతీయ ప్రయోజనాలను తీర్చగల రాజకీయ వేదిక రూపుదిద్దుకోవడానికీ, అనేక అంతర్జాతీయ వేదికలపై భారత జాతీయ ప్రయోజనాలను ధ్వనింపచెయ్యడానికీ కారకులు కావడం ఓ విశేషం. ప్రపంచం గుర్తించిన గొప్ప వక్తల్లో నౌరోజీ ఒకరు. అరుదైన వ్యక్తిత్వం! చారిత్రక నేపథ్యంలో భారతదేశ స్థితిగతులను విశ్లేషిస్తూ బ్రిటిష్ పార్లమెంటుతో సహా ఎన్నో వేదికలపై ప్రసంగించినవాడు. ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలను సవిమర్శకంగా వివరించి, స్వతంత్రంగా కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించినవాడు. ఐరిష్ హోంరూల్ ఉద్యమం లాంటి అంతర్జాతీయ స్వభావం కలిగిన ప్రాంతీయ ఉద్యమాలను గుర్తించి వాటికి మద్దతు ప్రకటించినవాడు. ఫ్రీమ్యాసన్ తత్వం మొదలుకుని పత్రికా నిర్వహణలో విలువల వరకూ ప్రతి ఒక్క ప్రమాణాన్నీ నిష్టగా పాటించినవాడు. చదువుకున్నది గణితం–తత్వశాస్త్రం అయినప్పటికీ, బ్రిటిష్ విద్యార్థులకు గుజరాతీ భాషాసాహిత్యాలను బోధించేందుకు వెనకాడనివాడు. కేవలం మూడు సంవత్సరాలే బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడిగా వున్నప్పటికీ, ఉత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించిన ‘పెద్దమనిషి’ దాదాభాయ్ నౌరోజీ. ఇవి ఆయన వ్యక్తిత్వంలో ప్ర«ధానమైన లక్షణాలు మాత్రమే! ఆర్థిక జాతీయవాది! ఆర్థిక జాతీయవాదాన్నీ, రాజకీయ జాతీయవాదాన్నీ పొందికగా మేళవించినవాడిగా దాదాభాయ్ నౌరోజీని లోకం ప్రశంసించింది. స్వయంగా పత్తి వర్తకుడయిన నౌరోజీ, వర్తకవాణిజ్య వర్గాల ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించడం సహజం. పందొమ్మిదో శతాబ్దిలోనే షేర్ మార్కెట్ మర్మాలు తెలుసుకుని అందుకు తగిన రీతిలో తమ వాణిజ్య నైపుణ్యాన్ని దిద్దితీర్చుకున్న పార్సీ వర్తకులు కొందరున్నారు. కామాలూ, టాటాలూ, మెహ్తాలూ, గోద్రెజ్లూ, వాడియాలూ అప్పుడూ ఇప్పుడూ కూడా పెద్ద ఎత్తున జాతీయ–అంతర్జాతీయ మార్కెట్లలో ప్రముఖ పాత్ర వహించారు. పత్తి – ఇనుము – ఉక్కు మొదలుకుని ఐటీ వరకూ వాళ్ళు ప్రభావితం చెయ్యని వర్తక వాణిజ్య పరిశ్రమలు లేవంటే అతిశయోక్తి కాదు. అయితే వాళ్ళకీ, నౌరోజీకీ ఓ ప్రధానమయిన తేడా వుంది! జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఏయే శక్తు్తలు ఏ పాత్ర వహిస్తున్నాయో వాళ్ళలో ఎవ్వరూ విశ్లేషించి సిద్ధాంతీకరించలేదు! దాదాభాయ్ నౌరోజీ ఒక్కరే ఆ పని చేశారు! అలా చెయ్యడంలో ఇమిడివున్న ప్రమాదాన్ని మనం నౌరోజీకి వివరించాల్సిన అవసరం లేదు. పార్సీలకు వాణిజ్య ప్రయోజనాలను ఇతరులు నేర్పాల్సిన పని లేదు కదా! ఇక్కడే, నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భారతీయ పెట్టుబడిదారుల వర్గ ప్రయోజనంతో పాటు, పరాధీనమయివున్న భారత జాతి ప్రయోజనాల గురించి కూడా పట్టించుకోవడమే నౌరోజీ వ్యక్తిత్వంలోని విశేషాంశ. నౌరోజీ, ఓ చరిత్రాత్మ! తన సొంత వాణిజ్య ప్రయోజనాన్ని మించిన వర్గ ప్రయోజనాన్ని, జాతీయ ప్రయోజనాన్ని గుర్తించి, అందుకు తగిన రీతిలో స్పందించడంతో దాదాభాయ్ నౌరోజీ ఆగిపోలేదు! బ్రిటిష్ వలసవాదం నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారాయన. భారతీయులు బ్రిటిష్ సర్కారుకు కట్టే పన్నులను నౌరోజీ ‘కప్పం’గా అభివర్ణించేవారు. నిరుపేద భారతీయులు నిష్కారణంగా బ్రిటిష్ సర్కారుకు ‘కప్పం’ కడుతున్నారనీ, పాలితుల ప్రయోజనాల పట్ల బ్రిటిష్ సర్కారుకు కనీసమైన లక్ష్యం కూడా లేదనీ రాజకీయ విమర్శలు గుప్పించి ఊరుకోలేదు నౌరోజీ. తన ఆరోపణలు రుజువు చేసే క్రమంలో లోతయిన విశ్లేషణతో కూడిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించేంత వరకూ నౌరోజీ విశ్రమించలేదు. – మందలపర్తి కిషోర్ (చదవండి: లక్ష్యం ఒక్కటే దారులు వేరు) -
సామ్రాజ్య భారతి: జననాలు, ఘట్టాలు, చట్టాలు
జననాలు ► సిస్టర్ నివేదిత : వివేకానందుడి శిష్యురాలు. హిందూమతాన్ని స్వీకరించిన ఐ్లరండ్ మహిళ ►గగనేంద్రనాథ్ టాగోర్ బెంగాలీ పెయింటర్, కార్టూనిస్ట్, టాగోర్ కుటుంబీకుడు (కలకత్తా) ►చిలకమర్తి లక్ష్మీ నరసింహం : తెలుగు రచయిత, నాటకకర్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఖండవల్లి (ప.గో.జిల్లా) ►శ్రీమద్ రాజాచంద్ర జైన కవి, తాత్వికుడు, మార్మిక మేధావి (గుజరాత్) ఘట్టాలు ►ఉర్దూ స్థానంలో హిందీని అధికార భాషగా చేయాలని ఉమ్మడి ప్రావిన్సులైన ఆగ్రా, అవద్లలో హిందువుల డిమాండ్. ►మే–ఏప్రిల్‌గా ఉన్న ఆర్థిక సంవత్సరం.. బ్రిటన్‌లోని పాలనకు అనుగుణంగా ఏప్రిల్–మార్చిగా మార్పు. ► ‘ఈస్ట్ ఇండియా అసోసియేషన్’ (ఇ.ఐ.ఎ.) ను స్థాపించిన దాదాభాయ్ నౌరోజీ. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆవిర్భావానికి ముందు నాటి సంస్థలలో ఇ.ఐ.ఎ. కూడా ఒకటి. చట్టాలు ►మర్డరస్ అవుట్రేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ ►పబ్లిక్ గ్యాంబ్లింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్ ►ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్