జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు
ఇందూరు: జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. గ్రామీణాభివృద్ధి సంఘం సమావేశం జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు అధ్యక్షతన, వ్యవసాయ సంఘ సమావేశం చైర్పర్సన్ సుమనారెడ్డి అధ్యక్షతన జరిగాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని, పథకాల అ మలులో వైపల్యాలను సభ్యులు ఎండగట్టి ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎ దుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
రెండున్నర గంటలు సాగిన ‘గ్రామీణాభివృద్ధి’ సమావేశం
‘గ్రామీణాభివృద్ధి’ సమావేశంలో డ్వామా పీడీ శివలింగయ్య, గృహ నిర్మాణ శాఖ పీడీ చైతన్యకుమార్, పౌర సరఫరాల అధికారి కొండల్రావు, డీఆర్డీఏ పీడీ వెంకటేశం ఆర్టీసీ, పరి శ్రమలు, సహకార శాఖ, పంచాయతీ తదితర శాఖల అధికారులు తమ శాఖల అభివృద్ధి పను లు, పథకాల గురించి వివరించారు. రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో జడ్పీ సీఈఓ రాజారాం పాల్గొన్నారు.
కొందరే మాట్లాడారు
దాదాపు 14 శాఖల అధికారులతో సమావేశం జరిగినా సభ్యులు అంతగా చర్చించలేకపోయారు. గాంధారి జడ్పీటీసీ తానాజీరావు మాట్లాడుతూ నిర్మల్ భారత్ అభి యాన్ పథకం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్రజలకు పేమెంట్లు ఇచ్చే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోందని, ఇతరులు క ట్టుకోవడానికి ముందుకు రావడంలేదని, దీని వెనుక కారణాలేంటో తెలుపాలన్నారు. ఇందిర జల ప్రభ పథకంలో రైతులు వేయించుకున్న బోర్లకు నేటికి విద్యుత్ క నెక్ష న్ ఇవ్వలేదన్నారు.
ఉపాధిహామీ పథకంలో జరిగిన అక్రమాలు, ఎంత మందిపై చర్యలు తీసుకుని నిధులు రికవరి చేశారో తెలుపాలని కోరారు. ఉపాధిహామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలా తీర్మానం చేయాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మహారాష్ట్రవారు మన జిల్లా లో తవ్వకాలు జరుపుతున్నారని, తద్వా రా జిల్లాకు వచ్చే ఆదాయాన్ని నష్టపోతున్నామన్నారు. బోధన్, నందిపేట్ జడ్పీటీసీ సభ్యులు లావణ్య, స్వాతి, కో-ఆప్షన్ మెంబర్ అన్సారి ముస్తాక్ హుస్సెన్ తదితరులు పలు సమస్యలను ప్రస్తావించారు.
తాత్కాలిక పర్మిట్లు ఇవ్వద్దు
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగేంత వరకు ఇసుక తవ్వకాలకు తాత్కాలిక పర్మిట్లు ఇవ్వకూడదని చైర్మన్ దఫేదార్ రాజు మైనింగ్ ఏడీని ఆదేశించారు. పర్మి ట్లు ఇచ్చేటప్పుడు తమకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. పర్మిట్ల ద్వారా వస్తున్న ఆదాయ వివరాలు తనకు తెలుపాలన్నారు. వర్ని, నిజాంసాగర్ బస్టాండ్ లు ఆధ్వానంగా ఉన్నాయని వాటిని బాగు చేయించాలని ఆర్టీసీ ఆర్ఎంకు సూచించారు.
వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశం
వ్యవసాయ స్థాయీ సంఘ సమావేశంలో 15 శాఖల అధికారులతో చర్చ జరిగింది. జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనా రెడ్డి మాట్లాడుతూ, ధర్పల్లి, చుట్టు పక్కల మండలాలలో కొందరు రైతులకు పంట నష్టపరిహరం అందలేదని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ రాజారాం ఎల్లారెడ్డి, రెంజల్ జడ్పీటీసీలు సామెల్ చిన్నబాలి, నాగభూషణం పాల్గొన్నారు.