హీరో వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం
హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, మూవీ మొఘల్ దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం బాపట్ల జిల్లా కారంచేడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుకున్న సురేశ్ బాబు.. కొడుకు అభిరాంతో కలిసి కారెంచేడు వెళ్లి బాబాయ్ మృతదేహానికి నివాళులర్పించాడు.
హీరో వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లడంతో కారెంచేడు రాలేకపోయినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం వెంకటేశ్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దగ్గుబాటి మోహన్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేశ్ .. మోహన్ బాబు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.