పక్షిపిల్ల ఎగరడం ఎలా నేర్చుకుంటుందంటే
న్యూయార్క్: పక్షిపిల్లలు తొలిసారి ఎగిరేందుకు రెక్కలకంటే ముందుగా కాళ్ళను ఉపయోగిస్తాయని పరిశోధకులు తేల్చారు. పక్షిపిల్లలు ఎగరడాన్ని ఎలా నేర్చుకుంటాయన్నదానిపై అమెరికా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సాధారణంగా పక్షులు ఎగిరేందుకు పెద్ద రెక్కలు, వాటి శరీర నిర్మాణం ఉపయోగపడుతుంది. కానీ, పక్షిపిల్లలకున్న చిన్నరెక్కలు, వాటి శరీరం ఎగరడానికి సహకరించవు.
తమకున్న ఈ పరిమితుల వల్లే పక్షిపిల్లలు ఏటవాలుగా గానీ, పాక్షికంగా గానీ ఎగరలేవ ని శాస్త్రవేత్తలు తెలిపారు. పక్షిపిల్లలు ఎగిరేందుకు ముందుగా డైనోసారస్ అవశేషాలుగా ఉన్నటువంటి కాళ్ల సాయంతో నెమ్మదిగా రెక్కలు అల్లాడించి ముందుగా ఎగిరేందుకు ప్రయత్నిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.