దళిత సాహిత్య అకాడవీ జేఏస్గా రాజేశ్వరి
భారతీయ దళిత సాహిత్య అకాడమీ (బీడీఎస్ఏ) హైదరాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా మెట్టుగూడకు చెందిన ఎం.రాజేశ్వరి శుక్రవారం నియమితులయ్యారు. బీడీఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజేశ్వరిని జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమించినట్టు అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ప్రకటించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సమక్షంలో ఆమెకు నియామక పత్రం అందించారు. రాజేశ్వరి మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన అకాడమీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నాయకులు ఎర్రగుడ్ల వేంకటేశ్వర్లు, నీరుడు కృష్ణ, సి.అంజలి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.