కూతురు వరసైన చిన్నారిపై క్రూరత్వం
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి శివార్లలోని దామినేడు క్వార్టర్స్ లో దారుణం జరిగింది. కూతురు వరసైన 8 ఏళ్ల చిన్నారిపై ప్రకాశ్ అనే వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో మూత్రం పోసిందన్న కారణంతో చిన్నారిని చితకబాదడంతో పాటు ఒంటిపై వేడినీళ్లు పోసి దారుణానికి ఒడిగట్టాడు.
విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు నిందితుడు ప్రకాశ్ కు దేహశుద్ధి చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.