వ్యసనాలతో యువత చిత్తు
మద్యం మత్తులో లా విద్యార్థినిపై సీనియర్ అత్యాచారం
నగరంలో కలకలం రేపిన ఘటన
పెదవాల్తేరు(విశాఖ) : చెడు వ్యసనాలతో యువత నేరాల బాట పడుతున్నారు. మద్యం మత్తులో ఉన్నత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చదువుకునే వయసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. గురువారం వెలుగు చూసిన న్యాయ విద్యార్థిని అత్యాచారం ఈ కోవకు చెందినదే. ఎంవీపీకాలనీ సెక్టార్-11లో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. దామోదర సంజీవయ్య లా యూనివర్శిటీలో ప్రథమ సంవత్సం చదవడానికి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి వచ్చిన ఆ విద్యార్థిని కామ దాహానికి బలైంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏం జరిగిందంటే..
బాధితురాలు ఎంవీపీ కాలనీలోకి అక్షయ వసతి గృహంలో ఉంటూ న్యాయ విద్యనభ్యసిస్తోంది. ఆమె స్నేహితులైన నలుగురు యువతులు అదే కాలనీలోని ఓ అద్దె నివాసంలో ఉంటున్నారు. వీరికి అదే కళాశాలలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న సీనియర్ రిషబ్సింగ్తో పరిచయం ఏర్పడింది. బుధవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి ఆమె స్నేహితురాలు, రిషబ్సింగ్ పార్టీ చేసుకున్నారు. పార్టీ అన ంతరం హాస్టల్‌కు వెళ్లకుండా బాధితురాలు రిషబ్సింగ్, తన స్నేహితురాళ్లతో కలిసి ఎంవీపీకాలనీలోని అద్దె ఇంటికి వె ళ్లి నిద్రపోయారు. ఈ క్రమంలో రిషబ్సింగ్కు మద్యం మత్తు ఎక్కువడడ ంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులు నిద్రపోయిన బెడ్రూమ్లు, బెడ్సీట్స్ తనిఖీచేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాధితురాలిని కేజీహెచ్‌కు తరలించారు.
దురాలవాట్లకు బానిసై..
చదువుకునే విద్యార్థులు దురాలవాట్లకు బానిసై, చ ట్ట వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీని వినియోగించి నేరాలు ఏ విధంగా చేయాలా అని ఆలోచించే విద్యార్థులూ ఉన్నారు. నేరాలు చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
- విద్యాసాగర్, సీఐ ఎంవీపీకాలనీ.