చైనా నౌక నుంచి 26 మృతదేహాలు వెలికితీత
జియాన్లీ: చైనాలోని యాంగ్జీ నదిలో జరిగిన నౌక ప్రమాదంలో సహాయక సిబ్బంది ఇంతవరకూ 26 మృతదేహాలను వెలికి తీశారు. ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రమాదానికి గురైన నౌకలో 405 మంది పర్యాటకులు, ఐదుగురు టూరిస్ట్ గైడ్లు, 46 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 15 మందిని ప్రాణాలతో రక్షించారు. ఆచూకీ గల్లంతైన 400 మందికి పైగా యాత్రికులు మరణించి ఉంటారని భావిస్తున్నారు.
ఆసియాలోనే అత్యంత పొడవైన యాంగ్జీ నదిలో సోమవారం రాత్రి ఈస్టర్న్ స్టార్ అనే పర్యాటక నౌక తుపానులో చిక్కుకుని మునిగిపోయిన విషయం తెలిసిందే. సాధ్యమైనంతమంది పర్యాటకుల్ని ప్రాణాలతో రక్షించడానికి 3 వేల మంది సహాయక సిబ్బంది, 110 గాలింపు నౌకలతో పాటు హెలికాప్టర్లను రంగంలోకి దించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.