ఆయనడిగితే రెడీ!
‘‘నా భర్త డేనియల్ అడగాలే కానీ ఆయన సినిమాలో ఏ పాత్రయినా చేస్తా’’ అంటున్నారు శృంగార తార సన్నీలియోన్. ఆమె నటించిన ‘కుఛ్ కుఛ్ లోచా హై’, ‘ఏక్ పహేలీ లీలా’ చిత్రాలలో భర్త డేనియల్ వెబర్ కూడా తళుక్కున మెరిశారు. ఇక, ఇప్పుడు ‘డేంజర్ హస్న్’ అనే చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. దీని గురించి సన్నీలియోన్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. డేనియల్ కూడా ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు. చాలా మంది ఈ ‘సినిమాలో ఏదైనా పాత్రలో మీరు కూడా నటిస్తారా’ అని అడుగుతున్నారు. నాకూ నటించాలనే ఉంది, మా వారు అడిగితే ఏం చేయడానికైనా రెడీ’’ అని చెప్పారు.