హక్కులకోసం ఉద్యమించాలి
-తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు డప్పు స్వామి
తెలకపల్లి : కళాకారులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల జిల్లా అధ్యక్షుడు డప్పు స్వామి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని యోగా భవనంలో సోమవారం జానపద కళాకారుల డివిజన్ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కళాకారులు ఎక్కడున్నా గుర్తించబడతారని, కళాకారుల శ్రమ వృథాగా పోదన్నారు. కళాకారుడిగా ప్రజా సమస్యలను వెలికితీయడం, ప్రజా సమస్యలు ఎత్తి చూపడం వల్లే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం కళాకారులకు ఉద్యోగాలిచ్చినా అందరికి అవకాశం రాకపోవడంతో ఇతర పథకాల్లో భాగస్వాములు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మల, మాజీ ఎంపీటీసీ యాదయ్య, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుధాకర్, రవిశంకర్, భాస్కర్, శివనాగులు, రాంచందర్, రాము, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.