నేటినుంచి దర్వేష్ అలీ ఉర్సు
ధరూరు : మండల కేంద్రంలోని దర్వేష్అలీ దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూముస్లింలు కలిసి జరుపుకొనే ఉర్సు ఉత్సవాలు సోమవారం గంధంతో ప్రారంభమవుతాయి. ఇప్పటికే దర్గా వద్ద ఏర్పాట్లను మత పెద్దలు ముమ్మరం చేశారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు జిల్లాలోని ఆయా ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూలు, అనంతపురం, పుణె, మహారాష్ట్ర, ముంబాయి ప్రాంతాల నుంచి భక్తులు దర్గాకు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇందుకనుగుణంగా దర్గాలో ఏర్పాట్లను చేస్తున్నారు. మంగళవారం ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బుధవారం సైతం ఉత్సవాలను నిర్వహించి గురువారంతో ముగించనున్నట్లు నిర్వాహకులు వాహబ్సాబ్, దర్వేష్అలీ తెలిపారు.