dasari rammohan rao
-
కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఓటు వేయవద్దు
తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్ రామ్మోహనరావు ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: రిజర్వేషన్ల హామీని మరిచిన కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఎట్టిపరిస్థితులలోనూ ఓటు వేయవద్దని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్ దాసరి రామ్మోహనరావు పిలుపునిచ్చారు. గురువారం ఇచ్ఛాపురంలో పర్యటించిన ఆయన సంఘ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలగ, ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని 2004 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న కాంగ్స్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలగ, బలిజలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో పోరాటాలు చేసినా ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోకుండా ఫైల్‌ను తోక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తెలగ, బలిజ, కాపులు 22 శాతం జనాభా ఉంటారని, ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా ఈ కులాల ఓట్లు కీలకమన్నారు.తెలగ కులస్తులందరూ తమ ఓట్లు చీల్చుకోకుండా, అమ్ముకోకుండా ఐకమత్యంగా, బాధ్యత యుతవంగా వ్యవహరించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే జనాభా దామాషా ప్రకారం అత్యధిక స్థానాలు ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని నిజాయితీగా మేనిఫెస్టోలో హామీ ఇస్తుందో తమ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక తెలగ కుల పెద్దలు బల్లా రామారావు, వల్లూరి జానకి రామారావు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై హామీ ఇస్తేనే మద్దతు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలగ, బలిజ, కాపు వర్గాలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తామని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహనరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కాస్మాపాలిటన్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి నిజాయతీగా వ్యవహరించాలని పార్టీలను కోరారు. మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయి పోరాటాలు చేసినా నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించలేదని, పైగా ఫైల్‌ను తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో 22 శాతం ఉన్న తెలగ, బలిజ, కాపు ఓట్లు కీలకం కాబట్టి అవి చీలిపోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. కాపు, బలిజ వర్గీయులు అధికంగా ఉన్న ప్రాంతాలలో సీట్లకోసం పోరాడతామన్నారు. పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే ఆయా ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి సత్తా చూపుతామని హెచ్చరించారు. అనంతరం ఆయన కాపు సద్భావనా సంఘ నాయకులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కాపు సంఘ నాయకులు వీవై దాసు, బసవా ప్రభాకరావు, పెద్దాడ సుబ్బారాయుడు, శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు ఇవ్వాలి పిఠాపురం టౌన్ : తెలగ, బలిజ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను కేటాయించాలని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యచరణ వేదిక (టీబీకే జేఏసీ) రాష్ట్ర కన్వీనర్ దాసరి లోవ పిఠాపురంలో బుధవారం జరి గిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం కాపు, తెలగ, బలిజ కులస్తులు కల సికట్టుగా పోరాడాలన్నారు. సమావేశంలో వేదిక ప్రతి నిధులు బాలిపల్లి రాంబాబు, బస్వా శ్రీను, ఎస్.సతీష్, పి.రవికిరణ్, వై.దొరబాబు పాల్గొన్నారు. -
సీమాంధ్రలో 40ఎమ్మెల్యే టికెట్లివ్వాలి
తెలగ, బలిజ, కాపు జేఏసీ డిమాండ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: సీమాంధ్రలో 22శాతం తెలగ, బలిజ, కాపులు ఉన్నారని ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా తమ ఓట్లే కీలకమని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక, తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహన్రావు అన్నారు. సీమాంధ్రలో అన్ని పార్టీలు కాపులకు 40 ఎమ్మెల్యే, ఐదు ఎంపీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అన్ని పార్టీలు జనాభా దామాషా ప్రకారం కాపులకు సీట్లు కేటాయించకపోతే తమ వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకుంటామని శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.