దసరాకు సిద్దిపేట జిల్లా షురూ
సిద్దిపేట తాత్కలిక కలెక్టరేట్‌గా ఎల్లంకి
కళాశాల భవనాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: దసరా పండుగ నుంచి సిద్దిపేట జిల్లాకు రాజముద్ర పడనుందని, అధికారికంగా జిల్లా ప్రక్రియ ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా కేంద్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సిద్దిపేట తాత్కాలిక కలెక్టరేట్ కోసం ఎంపిక చేసిన పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాలను బుధవారం మంత్రి పరిశీలించారు. రాష్ర్టంలో సిద్దిపేట ఎంతో ఖ్యాతి గడిచిందని, జిల్లా కేంద్రంగా మారనున్న సిద్దిపేట కలెక్టరేట్‌కు కావాల్సిన భవన సముదాయాలు ఎల్లంకి కళాశాలలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కలెక్టరేట్ కానున్న దృష్ట్యా కళాశాలలోని ప్రతి భవనాన్ని మంత్రి పరిశీలించారు. పార్కింగ్‌కు అనువైన మైదానం, మౌలిక వసతులను ఆరా తీశారు. ఆయన వెంట ఓఎస్డీ బాల్‌రాజు, తహసీల్దార్ శ్రీనివాస్, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు, మచ్చవేణుగోపారెడ్డి, చిప్ప ప్రభాకర్, గ్యాదరి రవి, సాకి అనంద్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.