data packs
-
1000జీబీ డేటా కేవలం రూ. 199కే..!
టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టించింది. తక్కువ ధరలకే ఇంటర్నెట్ డేటాను , ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని యూజర్ల కోసం జియో ప్రవేశపెట్టింది. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు దిగివచ్చాయి. గత్యంతరం లేక పలు దిగ్గజ మొబైల్ నెట్‌వర్క్‌లు ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్‌ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్‌లో జియోఫైబర్‌ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది. జియోఫైబర్‌తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో 999,1499,2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణను పొందాయి. తాజాగా జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా(1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్‌తో కలిపి రూ.234.82రూపాయలకు రానుంది. కాగా డేటా ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తరువాత 1ఎమ్‌బీపీఎస్ స్పీడ్ వస్తుంది. -
ఎయిర్టెల్ రూ.5లకే 4జీబీ 4జీ డేటా
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ జియో తాకిడిని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి టెలికం కంపెనీలు చేయని ప్రయత్నం లేదు. అప్పటి వరకూ ఆకాశాన్నంటుతున్న డేటా ధరలు జియో రాకతో ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. అయినా వినియోగదారులు జియోవైపే మొగ్గు చూపుతుండటంతో తమ వినియోగదారులను కాపాడుకోవడానికి టెలికాం కంపెనీలు కూడా సరికొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అలాగే దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా ఎయిర్టెల్ సరికొత్త రీచార్జ్‌ను ప్రవేశ పెట్టింది. కేవలం రూ.5లకే 4జీబీ డేటా అందిస్తోంది. అయితే ఇది అందరికీ వర్తించదు. 2జీ, 3జీ సిమ్ నుంచి 4జీ సిమ్‌కు అప్‌గ్రేడ్ అయిన వారికి మాత్రమే ఇస్తోంది. అదికూడా ఒక్కసారే. 2జీ నుంచి 4జీ అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటి రీచార్జ్ రూ.5తో చేయించుకుంటే 4జీబీ 4జీ డేటా వస్తుంది. డేటా బ్యాలెన్స్ కాలపరిమితి ఏడురోజులు మాత్రమే. ఎయిర్టెల్ ముఖ్యంగా జియో తాజా ఆఫర్‌కు పోటీగా సరికొత్త రీచార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. -
ఎక్స్ క్లూజివ్ డేటా ప్యాక్: ఏడాదంతా
రోజుకో కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను మురిపిస్తున్న టెల్కోలకు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఓ కొత్త సూచన చేసింది. మొబైల్ ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న డేటా ప్లాన్స్ లో కనీసం ఒక్క డేటా ప్యాక్ అయిన ఏడాది కాలపరిమితితో తీసుకురావాలని పేర్కొంది. ఏడాది పాటు కాలపరిమితితో కూడిన డేటా ప్యాక్ లను ఆఫర్ చేసేందుకు టెల్కోలకు ట్రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, కంపెనీలు మాత్రం దీర్ఘకాల వాలిడిటీ ప్యాక్ లవైపు తగిన శ్రద్ధ చూపడం లేదు. గరిష్టంగా 90 రోజులున్న మొబైల్ డేటా ప్యాక్ ల పరిమితిని 365 రోజులకు పెంచుతూ రెగ్యులేటరి గత 10 నెలల క్రితమే తన ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపి 10నెలలు కావస్తున్నా చాలా కంపెనీలు ఏడాది ప్యాక్ లను ఆఫర్ చేయడం లేదు. ఇటీవలే దీర్ఘకాలిక మొబైల్ డేటా ప్యాక్ లు, స్పెషల్ టారిఫ్ ఓచర్లపై సమీక్ష చేపట్టిన ట్రాయ్, ఈ విషయాన్ని నోటీసు చేసింది. కొన్ని ఆపరేటర్లు మాత్రమే 365 రోజుల వాలిడిటీతో స్పెషల్ టారిఫ్ ఓచర్లు తీసుకొస్తున్నాయని, కానీ చాలా ఆపరేటర్లు ఉన్న డేటా బెనిఫిట్లనే తరువాతి రీఛార్జ్ లతో 12 నెలల వరకు పొడిగిస్తూ వెళ్తున్నాయని ట్రాయ్ గుర్తించింది. కానీ ఎలాంటి డేటా ఎస్టీవీలను 90రోజుల కంటే ఎక్కువ వ్యవధిలో తీసుకురావడం లేదని ట్రాయ్ తెలిపింది. అన్ని టెలికాం సర్వీసు ప్రొవేడర్లు ఒకే పేమెంట్ విధానంతో కనీసం ఒక ఎస్టీవీనైనా తీసుకురావాల్సిందేనని ట్రాయ్ తాజాగా వారిని ఉద్దేశించి ఓ అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్యాక్ లో 365 రోజులకు ఎక్స్ క్లూజివ్ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పేర్కొంది. మరో నెల లేదా రెండు నెలలో దీనిపై సమీక్ష చేపడతామని, ఆపరేటర్లు స్పందించే తీరును బట్టి తదుపరిచర్యలు చేపడతామని ట్రాయ్ వార్నింగ్ ఇచ్చింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచడంతో పాటు తొలిసారి ఇంటర్నెట్ వినియోగించే వారిని ఆకర్షించేందుకు ట్రాయ్ దీన్ని తీసుకొచ్చింది.