ఎయిర్‌టెల్ రూ.5లకే 4జీబీ 4జీ డేటా
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ జియో తాకిడిని తట్టుకొని మార్కెట్లో నిలబడటానికి టెలికం కంపెనీలు చేయని ప్రయత్నం లేదు. అప్పటి వరకూ ఆకాశాన్నంటుతున్న డేటా ధరలు జియో రాకతో ధరలు ఒక్కసారిగా దిగి వచ్చాయి. అయినా వినియోగదారులు జియోవైపే మొగ్గు చూపుతుండటంతో తమ వినియోగదారులను కాపాడుకోవడానికి టెలికాం కంపెనీలు కూడా సరికొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అలాగే దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
తాజాగా ఎయిర్‌టెల్ సరికొత్త రీచార్జ్‌ను ప్రవేశ పెట్టింది. కేవలం రూ.5లకే 4జీబీ డేటా అందిస్తోంది. అయితే ఇది అందరికీ వర్తించదు. 2జీ, 3జీ సిమ్ నుంచి 4జీ సిమ్‌కు అప్‌గ్రేడ్ అయిన వారికి మాత్రమే ఇస్తోంది. అదికూడా ఒక్కసారే. 2జీ నుంచి 4జీ అప్‌గ్రేడ్ అయిన తర్వాత మొదటి రీచార్జ్ రూ.5తో చేయించుకుంటే 4జీబీ 4జీ డేటా వస్తుంది. డేటా బ్యాలెన్స్ కాలపరిమితి ఏడురోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ముఖ్యంగా జియో తాజా ఆఫర్‌కు పోటీగా సరికొత్త రీచార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది.