జియోకి కౌంటర్:ఎయిర్టెల్ సూపర్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా జియో తాజా ఆఫర్కుపోటీగా సరికొత్త రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఈ కొత్త పథకాలను ప్రారంభించింది.. రూ.399 రీచార్జ్‌పై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 84 రోజులపాటు అందించేలా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇదిరిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన రూ.399 ఆఫర్‌ను పోలి వుండడం గమనార్హం. అలాగే రూ.149 ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో 2 జీబీ 4జీ డేటాతోపాటు, 28 రోజుల పాటు ఎయిర్టెల్ టు ఎయిర్‌టెల్‌కు అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, రూ. 399రీఛార్జ్ ప్యాక్ అందరి వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ రీఛార్జ్ ప్యాక్ లభ్యతపై కస్టమర్ కేర్‌ను సంప్రదించి ,ఆఫర్ లభ్యతపై చెక్ చేసుకోవాలి.
అంతేకాదు ఎయిర్టెల్ పే మెంట్ బ్యాంకులో ఖాతాను తెరిచిన కస్టమర్లకు రూ.349 రీచార్జ్‌పై 10శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా జీయో రీచార్జ్ప్యాక్లను అందుబాటులోకి తెస్తే జియోకి కౌంటర్‌గా ఎయిర్ టెల్ మరిన్ని ఇతర ప్రణాళికలను ప్రారంభించింది.
రూ. 8 ప్లాన్: నిమిషానికి 30 పైసలతో స్థానిక + ఎస్టీడీ కాల్స్ 56 రోజులు వాలిడిటీ,
రూ. 40 ప్లాన్: అన్లిమిటెడ్ వాలిడిటీతో రూ. 35 టాక్ టైం.
రూ. 60 ప్లాన్: అన్ లిమిటెడ్ వాలిడిటీతో రూ.58 టాక్ టైం.
రూ. 5 ప్లాన్: 4జీబీ 3జీ / 4జీ డేటా, వాలిడిటీ 7 రోజులు 4జీ సిమ్ చెల్లుబాటు అయ్యే లా వన్ టైం రీచార్జ్
రూ. 199 ప్లాన్: అన్లిమిటెడ్ లోకల్ కాల్స్, 1Gజీబీ 2జీ / 3జీ/ 4జీ డేటా, 28 రోజుల వాలిడిటీ
మరోవైపు మరికొద్ది రోజుల్లో జియో 4జీ ఫోన్లు కస్టమర్ల చేతికి రానున్నాయి. ఇప్పటికే లక్షలమంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నారు. దీంతో ఎయిర్టెల్ సైతం రూ.2500కు ఫీచర్ ఫోన్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్న సంగతి తెలిసిందే.