సూపర్‌స్టార్‌కు గౌరవ పురస్కారం
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మలేషియా ప్రభుత్వం గౌరవ పురష్కారాన్ని అందించనుందనేది తాజా సమాచారం. రజనీకాంత్ కబాలీ చిత్ర షూటింగ్ కోసం ఇటీవలే మలేషయా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ని మలేషియా గవర్నర్ మోహమ్మద్ గహాలిల్ యాకోబ్ సాదరంగా ఆహ్వానించారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే మలేషియా ప్రభుత్వం రజనీకాంత్‌కు గౌరవ పరస్కారాన్ని అందించనుందని తెలిసింది.
రజనీకాంత్ మలేషియాలో జరుగుతున్న కబాలీ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్కడే నెల రోజుల పాటు జరగనుంది. కాగా మలేషియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావించే డత్తో అవార్డును మన సూపర్‌స్టార్‌కు అందించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. ఈ దేశ గవర్నర్ రజనీకాంత్‌కు డత్తో అవార్డును ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు, అందుకు మలేషియా ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది.
త్వరలోనే రజనీకాంత్‌కు డత్తో అవార్డు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ బిరుదును ఇంతకు ముందు బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్ అందుకున్నారు. ఇటీవలే హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారన్నది గమనార్హం. త్వరలో ఈ కోవలోకి మన సూపర్‌స్టార్ చేరనున్నారన్న మాట.