Davis Cup tennis Asia-Oceania Group-1
-
వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు భారత్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్ తమ అజేయ రికార్డును కొనసాగించింది. తటస్థ వేదికపై జరిగిన ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ టెన్నిస్ మ్యాచ్‌లో భారత్ 4–0తో విజయం సాధించింది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. మార్చి 6,7 తేదీల్లో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో... గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన క్రొయేíÙయా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి రోజు శుక్రవారం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గిన భారత ఆటగాళ్లకు రెండో రోజు శనివారం డబుల్స్ మ్యాచ్‌లో, రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లోనూ ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలుత డబుల్స్ మ్యాచ్‌లో భారత దిగ్గజం లియాండర్ పేస్–జీవన్ నెడుంజెళియన్ ద్వయం 6–1, 6–3తో మొహమ్మద్ షోయబ్–అబ్దుల్ రెహా్మన్ హుజైఫా జంటపై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల ఈ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట నాలుగుసార్లు పాక్ జోడీ సరీ్వస్‌ను బ్రేక్ చేసింది. 1990లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 46 ఏళ్ల లియాండర్ పేస్ ఈ మెగా టోర్నీలో తన డబుల్స్ విజయాల సంఖ్యను 44కు పెంచుకున్నాడు. డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు సాధించిన ప్లేయర్‌గా లియాండర్ పేస్ (43 విజయాలు) గత ఏడాది ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. నికోలా పెట్రాన్‌గెలి (ఇటలీ–42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ అధిగమించాడు. రివర్స్ సింగిల్స్‌లో సుమీత్ నాగల్ 6–1, 6–0తో యూసుఫ్ ఖలీల్‌పై గెలిచి భారత్‌కు 4–0 ఆధిక్యాన్ని అందించాడు. ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో భారత్ 7–0తో పాకిస్తాన్‌పై ఆధిక్యంలోకి వెళ్లింది. 2014 ఫిబ్రవరిలో చైనీస్ తైపీపై 5–0తో గెలిచాక భారత జట్టు ఓ డేవిస్ కప్ పోటీలో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గడం ఇదే తొలిసారి. -
భారత్ 3.. పాకిస్తాన్ 0
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ఆసియా ఓసియానియా గ్రూప్–1 డేవిస్ కప్ మ్యాచ్‌లో భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్తాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి తన స్కోరు 3-0కు పెంచుకుంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్-–జీవన్ నెడుంజెళియన్ జోడీ 6-1, 6-3 తేడాతో అబ్దుల్ హుజైఫా రెహ్మాన్–షోయబ్ మొహమ్మద్ తేడాతో గెలిచింది. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న భారత జోడికి రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. స్కోరు 3-3తో ఉన్నప్పుడు నువ్వు-నేనా అన్నట్లు సాగింది. కాగా, లియాండర్ పేస్ జంట అద్భుతమైన స్మాష్‌లను సంధించడంతో పైచేయి సాధించింది. ఇదే ఊపును కొనసాగించడంతో ఆ సెట్‌ను 6-3 తేడాతో గెలుచుకోవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. కేవలం 53 నిమిషాల పాటు జరిగిన పోరులో భారత్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక్కడ పాకిస్తాన్ టెన్నిస్ ఆటగాళ్ల అనుభవలేమి స్పష్టంగా కనబడింది. పేస్ రికార్డు 44కు చేరింది.. గతేడాది డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన డబుల్స్ ఆటగాడిగా రికార్డు సాధించిన లియాండర్ పేస్ తన రికార్డును మరింత పెంచుకున్నాడు. తాజా విజయంతో డబుల్స్ విభాగంలో 44వ గెలుపును అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఇటాలియన్ ఆటగాడు నికోలా పీట్రెంజెలీ(42) ఉన్నాడు. 57 డేవిస్ కప్ మ్యాచ్‌లకు గాను 44 విజయాలను పేస్ సాధించగా, నికోలా 66 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేశాడు. పేస్ 44 డబుల్స్ డేవిస్ కప్ రికార్డు సుదీర్ఘ కాలం చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం టెన్నిస్ ఆడుతున్న డబుల్స్ ప్లేయర్లు ఎవరూ టాప్-10లో లేరు. పాకిస్తాన్‌తో తటస్థ వేదికపై శనివారం మొదలైన ఈ పోరులో భారత్ 2–0తో ఆధిక్యంతో దూసుకుపోయింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్, 25 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–0, 6–0తో 17 ఏళ్ల షోయబ్ మొహమ్మద్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 131వ ర్యాంకర్, 22 ఏళ్ల సుమీత్ నాగల్ 6–0, 6–2తో 17 ఏళ్ల అబ్దుల్ హుజైఫా రెహ్మాన్‌పై గెలిచాడు. తాజా గెలుపుతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది. దాంతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌తో క్రొయేషియా జట్టుతో పోరుకు మార్గం సుగుమం అయ్యింది. -
ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్‌కు భారత్
► డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ జంట విజయం ► ఉజ్బెకిస్తాన్‌పై భారత్‌కు 3–0 ఆధిక్యం బెంగళూరు: అనుభవజ్ఞుడైన రోహన్ బోపన్న... అరంగేట్రం చేసిన శ్రీరామ్ బాలాజీ జోడీ కుదిరింది. వీరిద్దరూ ఆద్యంతం సమన్వయంతో రాణించి అదరగొట్టారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 రెండో రౌండ్ పోటీలో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగో ఏడాది ప్రపంచకప్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత సాధిం చింది. ఈ ఏడాది సెప్టెంబరులో వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–బాలాజీ ద్వయం 6–2, 6–4, 6–1తో దస్తోవ్–ఫెజీవ్ జంటపై గెలిచింది. తమ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జంటకు పోటీ ఎదురుకాలేదు. తన కెరీర్లో తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన బాలాజీ సర్వీస్ అద్భుతంగా చేయడంతోపాటు నెట్ వద్ద అప్రమత్తంగా ఉన్నాడు. మరో వైపు అపార అనుభవజ్ఞుడైన బోపన్న శక్తివంతమైన సర్వీస్‌లు చేయడంతోపాటు సింగిల్ హ్యాండెడ్ రిటర్న్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ మొత్తంలో భారత జంట 16 ఏస్‌లు సంధించడం విశేషం. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.