భిక్షాటన చేస్తూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన
రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న నగర పంచాయతీ పారిశుద్ధ్య, పారిశుద్ధ్యేతర కార్మికులు శనివారం ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేస్తూ తమ నిరసన తెలిపారు. కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మండల కార్యదర్శి మేడిపల్లి ఆనంద్ సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్మికులు, ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతూ అణిచివేత ధోరణిని అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.