Day of Persons with Disabilities
-
కేసీఆరే రావాలి!
వికలాంగుల ఆందోళన రసాభాసాగా మారిన వికలాంగుల దినోత్సవం అసెంబ్లీ వద్ద ధర్నాకు విఫలయత్నం సాక్షి, హైదరాబాద్: వికలాంగులు కోపోద్రిక్తులయ్యారు. కట్టలు తెగిన ఆగ్రహంతో ఒక్కసారిగా వేదికపైకి చొచ్చుకువచ్చి ఆందోళనకు ది గారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రావా లంటూ నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. దీంతో అంతర్జాతీయ వికలాంగుల దినం సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం అర్దంతరంగా ముగిసింది. అనివార్య కారణాలతో ముఖ్యమం త్రి హాజరుకావడంలేదని అధికారులకు ముందే తెలిసినా ఆయనకు స్వాగతం పలుకుతూ రవీంద్రభారతి ప్రవేశ ద్వారంతోపాటు వేదికపైనా బ్యానర్లను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వికలాంగులతో పాటలు, నృత్యపోటీలను నిర్వహించారు. చివరగా ఉన్నతాధికారులు, అతిథులు ప్రసంగించేం దుకు సిద్ధమవుతుండగా.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనని వికలాంగులు పట్టుబట్టారు. వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు రాంబాబు నేతృత్వంలో సుమారు వందమంది వికలాం గులు వేదికపైకి చొచ్చుకువచ్చి బైఠాయించారు. సభా ప్రాంగణం నినాదాలతో హోరెత్తింది. అనంతరం కొందరు వికలాంగులు ర్యాలీగా అసెంబ్లీ వద్దకు చేరుకుని అక్కడ ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ రావడం లేదని వికలాంగుల సంఘం నేతలకు ముందే తెలియజేసినా.. ఆందోళనకు దిగారని వికలాంగల సంక్షేమ శాఖ డెరైక్టర్ శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఆందోళనతో తమకు సంబంధం లేదని వికలాంగుల నెట్వర్క్, హృదయ్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. -
వికలాంగుల అవగాహన నడక
-
ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వికలాంగుల ఆటల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు మార్చ్‌పాస్ట్ అనంతరం గౌరవ వందనాన్ని సమర్పించి జాతీయ గీతాన్ని అలపించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని 23 ప్రత్యేక పాఠశాలలకు చెందిన వికలాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వందర మీటర్ల పరుగుతో పోటీలు ఆరంభమయ్యాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో రన్నింగ్, షాట్‌పుట్, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు నర్సింహులు, అదనపు జాయింట్ కలెక్టర్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.