Day/Night Test
-
బ్రిటన్‌లో 'తొలి గులాబి' మ్యాచ్
లండన్: క్రికెట్ పుట్టినిళ్లుగా పేరున్న బ్రిటన్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌కు వేధికను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఎడ్గ్బాస్టన్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గత ఏడాది జరిగింది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన టెస్ట్‌గా ఆ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను తొలిసారి వాడారు. కాగా, వచ్చే వారంలో పాకిస్తాన్, వెస్టిండిస్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడునుంది. దీంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చిన దేశాల్లో మూడో స్థానంలో బ్రిటన్ నిలువనుంది. పగలు పని చేసేవారు కూడా టెస్ట్ మ్యాచ్‌లను వీక్షిండానికి ప్రోత్సాహం కల్పించడమే తమ లక్ష్యం అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది ఆగష్టు17-22 మధ్య జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వెస్టిండిస్‌తో తలపడనుంది. -
డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌కు బీసీసీఐ సిద్ధం!
న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్ లో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు ప్రవేశపెట్టిన డే అండ్ నైట్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంగీకారం తెలిపింది. ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటన సందర్భంగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తాజాగా స్పష్టం చేశారు. 'ఈ ఏడాది న్యూజిలాండ్-భారత జట్ల మధ్య టెస్టు సిరీస్‌లో కచ్చితంగా ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం. అయితే దానికి ముందుగా దులీప్ ట్రోఫీలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహిస్తాం. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లు పింక్ బాల్‌తో జరిగే క్రమంలో ఆ బంతి భారత పిచ్‌లపై ఎలా పనిచేస్తుందనే పరిశీలించాల్సిన అవసరముంది. పింక్ బాల్ తో భారత స్పిన్నర్లు ఎలా రాణిస్తారు అనేది కూడా ఇందులో ఒక భాగం. ఇందుకు దులీప్ ట్రోఫీనే సరైన వేదిక అనుకుంటున్నాం' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానంగా టెస్టుల్లో ఎరుపు రంగు బంతుల్ని వాడే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి సమయాల్లో జరిగే మ్యాచ్ ల్లో ఫడ్లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది. గత ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ను పింక్ బాల్ తో నిర్వహించారు. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది.