డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు బీసీసీఐ సిద్ధం! | BCCI Set To Host Day/Night Test Against NZ This Year, says Anurag Thakur | Sakshi
Sakshi News home page

డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు బీసీసీఐ సిద్ధం!

Published Thu, Apr 21 2016 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు బీసీసీఐ సిద్ధం!

డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు బీసీసీఐ సిద్ధం!

న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్ లో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు  ప్రవేశపెట్టిన డే అండ్ నైట్ మ్యాచ్ల నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంగీకారం తెలిపింది. ఈ ఏడాది న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటన సందర్భంగా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తాజాగా స్పష్టం చేశారు.

'ఈ ఏడాది న్యూజిలాండ్-భారత జట్ల మధ్య టెస్టు సిరీస్లో కచ్చితంగా ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం. అయితే దానికి ముందుగా దులీప్ ట్రోఫీలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను నిర్వహిస్తాం. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ లు పింక్ బాల్తో జరిగే క్రమంలో ఆ బంతి భారత పిచ్లపై ఎలా పనిచేస్తుందనే పరిశీలించాల్సిన అవసరముంది. పింక్ బాల్ తో భారత స్పిన్నర్లు ఎలా రాణిస్తారు అనేది కూడా ఇందులో ఒక భాగం. ఇందుకు దులీప్ ట్రోఫీనే సరైన వేదిక అనుకుంటున్నాం' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


 ప్రధానంగా టెస్టుల్లో ఎరుపు రంగు బంతుల్ని వాడే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి సమయాల్లో జరిగే మ్యాచ్ ల్లో ఫడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే ఎరుపు కంటే ఇంకా స్పష్టంగా కనిపించేందుకు పింక్ రంగు బంతులని వాడాలని ఐసీసీ నిర్ణయించింది.  గత ఏడాది  యాషెస్ సిరీస్ సందర్భంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ను పింక్ బాల్ తో నిర్వహించారు. పింక్ బంతులు ప్రముఖ సంస్థ కుకుబుర్రా తయారుచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement