dead body
-
హైదరాబాద్‌లో దారుణం.. బాబు మృతదేహాం కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాబు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. బాబును ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: మిస్టరీగా వందన మృతి.. సందీప్ ఇంట్లో ఏం జరిగింది..? -
రష్యా విజయం సాధించింది: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనల దాడుల్లో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో సామాన్య పౌరులు మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా.. రష్యా తీరుపై మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా కారిడార్, ఓడరేవు నగరమైన మరియుపోల్లోకి వెళ్లకుండా రష్యా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఎందుకంటే అక్కడ వేలాది మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బలగాలు చంపేశాయని తెలిపారు. తాము అక్కడికి వెళితే రష్యా సైన్యం అసలు స్వరూపం బయటపడుతుందన్న కారణంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. సాక్ష్యాలను దాచడంలో రష్యా విజయం సాధించిందని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు. తమను చూసి రష్యా భయపడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, మరియుపోల్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు శక్తివంతమైన వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 50 మంది పౌరులు మంటల్లో సజీవ దహనమయ్యారని సిటీ మేయర్ వాదిమ్ బాయ్‌చెన్‌కో ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరోవైపు.. రష్యాపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా మాజీ ప్రధాని దిమిత్రి మిద్వేదేవ్, మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్, సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెల్గోవ్, రష్యా పొలిటికల్ లీడర్ మిఖాయిల్ మిషుస్టిన్పై అగ్ర రాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించింది. -
అంత్యక్రియలు అయిన వారానికి.. ‘బతికాడు’
కోల్‌కతా: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కుటుంబం తీవ్ర మనోవేదనను అనుభవిస్తోంది. కుటుంబ సభ్యుడు మరణించాడంటూ వేరే వ్యక్తి మృతదేహం వారికి అప్పగించారు. అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యుడు బతికే ఉన్నాడని తెలిసింది. దాంతో వారు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. శిబ్దాస్ బెనర్జీ(75) అనే వృద్ధుడికి కరోనా సోకడంతో ఈ నెల 4న బలరాంపూర్ బసు ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అదే రోజున మోహినిమోహన్ ముఖర్జీ(75) అనే వ్యక్తి కూడా కోవిడ్ బారిన పడి బెనర్జీ చేరిన ఆస్పత్రిలోనే చేరారు. ఈ నేపథ్యంలో నవంబర్ 13న ఆస్పత్రి సిబ్బంది బెనర్జీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అతడు చనిపోయాడని తెలిపారు. అనంతరం ముఖర్జీ మృతదేహాన్ని వారికి అప్పగించారు. కరోనాతో మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రొటెక్టివ్ మెటిరియల్తో పూర్తిగా చుట్టి వారికి అందించారు. దాంతో లోపల ఉన్నది బెనర్జీనే అని భావించారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: ప్రపంచానికి పెను సవాలు.. కరోనా) వారం రోజుల తర్వాత బెనర్జీకి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుండగా ఆస్పత్రి సిబ్బంది వారికి కాల్ చేసి అతడు బతికే ఉన్నాడని.. పొరపాటున వేరే వారి మృతదేహం అప్పగించామని తెలిపారు. ఇది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బెనర్జీ బతికే ఉన్నాడని తెలిసి ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డీన్ మాట్లాడుతూ.. ‘బెనర్జీ ఆస్పత్రిలో చేరిన రోజునే ముఖర్జీ కూడా చేరారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం ముఖర్జీని బర్సాత్కు తరలించాం. అయితే బై మెస్టేక్ సిబ్బంది ముఖర్జీకి బదులు బెనర్జీ మెడికల్ రిపోర్టును బర్సాత్కు పంపించారు. ఈ క్రమంలో ముఖర్జీ చనిపోవడంతో మెడికల్ రిపోర్టుల ప్రకారం అతడి మృతదేహాన్ని బెనర్జీ కుటుంబ సభ్యులకు అందించాము. ఈ లోపు బలరాంపుర్ బసు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెనర్జీ కోలుకున్నారు. దాంతో అధికారులు ముఖర్జీ కుటుంబ సభ్యులకు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు చేసిన తప్పిదం వెలుగులోకి వచ్చింది’ అన్నారు. ఆస్పత్రికి వచ్చిన ముఖర్జీ కుటుంబ సభ్యులు అక్కడ వేరే వ్యక్తి ఉండటంతో దీని గురించి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారు మెడికల్ రిపోర్టులు మారడంతో సమస్య తలెత్తిందని గుర్తించి బెనర్జీ ఇంటికి కాల్ చేసి అతడు బతికి ఉన్న విషయాన్ని తెలిపారు. వచ్చి తీసుకేళ్లాల్సిందిగా సూచించారు. ఇక అధికారుల నిర్లక్ష్యం పట్ల ఇరు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
మహిళ దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అదృశ్యం అయినట్లు కేసు నమోదు అయిన మహిళ బుధవారం శవమై తేలింది. స్థానిక రోషన్గుడకు చెందిన వెంకటమ్మ(42) అనే మహిళ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో వెంకటమ్మ కనిపించడం లేదని కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్యచేసి డీఆర్డీఎల్ వెనుక భాగంలోని చెట్ల పొదల్లో పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పసికందు మృతదేహం
పుట్టిన రోజే చావురోజు కవరులో పెట్టి బావిలో వేసిన వైనం తాడేపల్లి రూరల్ : పెనుమాక గ్రామంలోని కొత్తూరు ప్రాంత తాగునీటి బావిలో గురువారం ఆడ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సెల్‌ఫోన్ ప్యాకింగ్ కవర్లో ఆ పసికందు మృతదేహాన్ని చుట్టి బావిలో పడవేసినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో రెండు కాళ్లూ కవరను చీల్చుకుంటూ బయటకు వచ్చాయి. ముందు స్థానికులు ఏదో జంతువు మృతదేహం అనుకున్నారు. స్థానికంగా నివసించే యువకులు బావిలోకి దిగి పరిశీలించగా ముక్కుపచ్చలారని పసికందు కనిపించింది. బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఎవరైనా తీసుకువచ్చి బావిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వీఆర్వో ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. స్థానికులు మాత్రం ఈ పసికందు మృతదేహాన్ని మంగళగిరి నుంచి తీసుకువచ్చి స్థానికుల సహాయంతో బావిలో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తీసుకువచ్చిన కవర్‌పై విమలా మొబైల్స్, నవతా ట్రాన్స్‌పోర్టు ఆపోజిట్, మంగళగిరి అని ఉంది. దీంతో కవర్ ఆధారంగా స్థానికులు మంగళగిరికి చెందినవారే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పెనుమాకలోనే పంచాయతీ కార్యాలయం సమీపంలో ఆడపిల్లను తీసుకువచ్చి కవర్లో ప్యాకింగ్ చేసి బావిలో పడవేసిన ఘటన జరిగింది. బహుశా అక్రమ సంబంధాల నేపథ్యంలో ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించి, ఎవరికీ తెలియకుండా ఇలా చేశారేమోనని, దానికి స్థానికులు ఎవరైనా సహకరిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు మంగళగిరి, పెనుమాక తదితర ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ల ద్వారా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రిల్లో సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.