వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి అక్టోబర్ 5న తీవ్రమైన వర్కవుట్ సెషన్లో వెన్నుకి గాయమయ్యింది. ఆమె జిమ్‌లో బ్యాక్బ్రేస్ని ధరించకుండా 80 కిలోల డెడ్లిఫ్ట్ని నిర్వహించి వెన్ను నొప్పి బారిన పడింది. అయినా లెక్క చేయక ఆ తర్వాత కూడా వర్కౌట్ సెషన్‌ని కొనసాగించింది. దీంతో ఆమె వెన్నుకి తీవ్ర గాయమయ్యింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. నిజానికి ఈ డెడ్‌లిఫ్ట్ వర్కౌట్స్‌ని ఒత్తిడిని నివారించడానికి, వెన్ను కండరాలను బలోపేతం చేయడానికి ఎక్కువగా చేస్తుంటారు. అయితే ఇవి చేసేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ నిపుణుల ఆధ్వర్యంలో వారి సూచనలు సలహాలతో చేయాలి. ఇక్కడ రకుల్లా గాయాల బారిన పడకుండా వెనుక కండరాలను బలోపేతం చేసే కొన్ని ప్రభావవంతమైన వ్యాయామాలు ఏంటో సవివరంగా చూద్దామా..!వార్మ్-అప్వార్మప్తో వ్యాయామాన్ని ప్రారంభించడం చాలా అవసరం. 5 నుంచి 10 నిమిషాల మితమైన కార్డియోతో ప్రారంభించండి, ఆపై ఫోర్స్‌గా చేసే వ్యాయామాలకు సిద్ధమయ్యేలా కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయండిరెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్చాలా మంది వ్యక్తులు రెసిస్టెన్స్ బ్యాండ్ పుల్-అపార్ట్ వ్యాయామాలతో తమ బ్యాక్ వర్కౌట్‌ను ప్రారంభిస్తారు. ఈ వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. సుమారు 15 నుంచి 20 చొప్పున 1 లేదా 2 సెట్లను పూర్తి చేసేలా మంచి రిసిస్టెన్స్ బ్యాండ్‌ను ఎంచుకోవాలి. లాట్ పుల్డౌన్ఈ వ్యాయామాన్ని రెసిస్టెన్స్ బ్యాండ్‌తో లేదా జిమ్‌లో మెషీన్ సాయంతో పూర్తి చేయవచ్చు. ఈ వ్యాయామం వెనుక డెల్టాయిడ్లు, రోంబాయిడ్స్, కండరపుష్టి, ముంజేతులతో పాటు మధ్య, దిగువ వెనుక కండరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. బలమైన వెన్ను కండరాలు కావాలనుకునే వారికి ఇది ముఖ్యమైన వ్యాయామం.క్వాడ్రూప్డ్ సింగిల్ ఆర్మ్ డంబెల్ రోకదలిక ఎగువన ఓవర్-రోయింగ్ కదలిక దిగువన ఎక్కువగా సాగదీయడం వంటి అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఏదైనా ఇతర రోయింగ్ కదలికలను పూర్తి చేయడానికి ఈ వ్యాయామాన్ని సిఫార్సు చేస్తారు నిపుణులు.(చదవండి: అత్యంత అరుదైన వ్యాధి నెమలైన్ మయోపతి)