సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ది డీల్’
రంగస్థలం నటుడు హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం పోస్టర్ని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు. ‘ఒక డిఫరంట్ స్టోరీతో వస్తున్న నన్న ప్రేక్షకులు ఆశ్వీరదించాలని కోరుతున్నాను’ అని హనుకోట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్పీసీ అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు.