Dearness allowance to the employees
-
ఉద్యోగులకు డీఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఒక డీఏ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులకు 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ చెల్లింపులు ఉండనున్నట్లు తెలిపింది. -
వెళ్తూ వెళ్తూ దాదాపు 14 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన కర్ణాటక మాజీ సీఎం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇదివరకే రాజీనామా చేసిన యడియూరప్ప… వెళ్తు వెళ్తు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాజీనామాకు కొద్ది గంటల ముందు ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా 21.50కు చేరింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. యడ్డీ నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షల మంది పెన్షనర్లతో పాటు వివిధ పీఎస్‌యూలు, కార్పొరేషన్లలో పనిచేసే దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనుంది. ఇప్పటికే పరిశీలకులుగా కేంద్రమంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్‌రెడ్డిలని నియమించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రేపేమాపో కర్ణాటక కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ వ్యవహరించనున్నారని తెలుస్తోంది. -
ఉద్యోగులకు డీఏ బకాయిల చెల్లింపు ఎప్పుడు? ఎంత ?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న 7వ వేతన ఒప్పందానికి సంబంధించి కీలక సమాచారం అందింది. కరువు భత్యం ఎప్పుడు చెల్లించాలనే అంశంపై కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరులో 7వ వేతన ఒప్పందం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం బేసిక్‌పై 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచనున్నారు. అయితే ఈ పెరిగిన డీఏను సెప్టెంబరు నెల జీతంలో కలిసి ఇస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సవరించిన డీఏతోనే కాకుండా గతంలో మూడు దఫాలుగా వాయిదా పడిన డీఏ బకాయిలు, పెన్షనర్లరకు సంబంధించి డీఆర్ బకాయిలు కూడా సెప్టెంబరులోనే చెల్లించనున్నట్టు తెలుస్తోంది. పెంపు ఇలా ఉండొచ్చు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కరువు భత్యానికి సంబంధించి క్లాస్ వన్ ఆఫీసర్లకి రూ. 11,880 నుంచి రూ. 37,554 వరకు పెరగవచ్చని అంచనా. అదే విధంగా లెవల్ 13కి సంబంధించి రూ. 1,23,100 నుంచి రూ. 2,15,900ల వరకు పెంపు ఉండొచ్చు, లెవల్ 14 విషయంలో రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 వరకు ఉండవచ్చు. జులై టూ సెప్టెంబర్ కరోనా సంక్షోభం కారణంగా 2020 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం వాయిదా వేసింది కేంద్రం. మరోవైపు 7వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, కరువు భత్యం పెంపు తదితర అంశాలపై అనేక సిఫార్సులు చేస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో జులై1 నుంచి 7వ వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన జీతంతో కలిసి డీఏలు చెల్లిస్తారనే ప్రచారం జరిగింది. అయితే కేంద్రం డీఏ , జీతాల చెల్లింపును మరోసారి వాయిదా వేసింది. -
కరువు భత్యంపెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు తీపికబురు. కరువు భత్యం(డీఏ) పెంపును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 2019, జనవరి 1 నుంచి జూలై 1 మధ్య కాలానికి సంబంధించిన 3.144 శాతం డీఏను మంజూరు చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 33.536 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. అలాగే 6,143 భాషా పండితులు, 802 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ గతంలో రాష్ట్ర విద్యా శాఖ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం రాటిఫై చేసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతానని కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించే అంశంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించారు. ఈ అంశంపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశాన్ని పరిశీలించాలని కేబినెట్ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
3.144% డీఏ పెంపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) 3.144 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల మూల వేతనంపై కరువు భత్యం 27.248 శాతం నుంచి 30.392 శాతానికి పెరిగింది. 2018 జూలై 1 నుంచి డీఏ పెంపు వర్తించనుంది. జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో పెరిగిన కరువు భత్యాన్ని ప్రభుత్వం చెల్లించనుంది. డీఏ బకాయిల చెల్లింపు ఇలా... 2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిలను సంబంధిత ఉద్యోగుల జీపీఏ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 సెప్టెంబర్ 30కి ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను మాత్రం ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించనుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమై కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులకు, 2018 జూలై 1 నుంచి 2019 మే 31 మధ్యకాలానికి సంబంధించిన పెరిగిన డీఏ బకాయిల్లో 10 శాతాన్ని వారి ప్రాణ్ (పీఆర్ఏఎన్) ఖాతాల్లో ప్రభుత్వ వాటా కలిపి జమ కానుంది. మిగిలిన 90 శాతం డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. జీపీఎఫ్‌కు అనర్హులైన ఫుల్‌టైం కాంటిజెంట్ ఉద్యోగుల డీఏ బకాయిలను జూలైలో చెల్లించనున్న జూన్ నెల వేతనంతో కలిపి నగదు రూపంలో చెల్లించనుంది. 3.144 శాతం పెంపు వీరికే... 2015 పీఆర్సీ ప్రకారం వేతనాలు అందుకుంటున్న జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్ చార్జీడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్ సహా ఇతర వర్సిటీల బోధన, బోధనేతర సిబ్బందికి 3.114 శాతం డీఏ పెంపు వర్తించనుందని ప్రభుత్వం తెలిపింది. యూజీసీ వేతనాలపై 6 శాతం డీఏ పెంపు సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది. సవరించిన యూజీసీ వేతనాలు–2006 అందుకుంటున్న ప్రభుత్వ, ఎయిడెడ్ అనుబంధ డిగ్రీ కళాశాలల బోధన, బోధనేతర సిబ్బంది, ప్రొఫెసర్ కె. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూహెచ్తోపాటు ఇతర వర్సిటీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల బోధన సిబ్బందికి ఈ పెంపు వర్తించనుంది. పద్మనాభన్ కమిటీ నివేదిక ఆధారంగా 2010లో జారీ చేసిన జీవో 73 మేరకు వేతన సవరణ పొందిన న్యాయాధికారుల కరువు భత్యాన్ని 142 శాతం నుంచి 148 శాతానికి ప్రభుత్వం పెంచింది. వేతన సవరణ–2010 ప్రకారం వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటును 107.856 శాతం నుంచి 112.992 శాతానికి పెంచింది. పార్ట్‌టైం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు నెలకు రూ. 100 వేతనం పెంచింది. ఈ ఉత్తర్వుల జారీకి ముందు ఎవరైనా ఉద్యోగులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు నగదు రూపంలో డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. -
డీఏ 5.992%
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ జూలై నుంచి వర్తింపు.. కొత్త రాష్ట్రంలో ఇదే తొలి పెంపు పెరిగిన భత్యాన్ని 1న అక్టోబర్ జీతంతో అందుకోనున్న ఉద్యోగులు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ) 5.992 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రాష్ట్రంలో డీఏ పెంపు ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారి. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 71.904 శాతం నుంచి 77.896 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి పెంపు వర్తిస్తుంది. తాజా పెంపు మేరకు డీఏను నవంబర్ 1న ఇవ్వనున్న అక్టోబర్ జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నారు. జూలై నుంచి సెప్టెం బర్ వరకు 3 నెలల డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఉద్యోగులకు ఎస్పీఎఫ్(స్టేట్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాల్లో వేయనున్నారు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతా లో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 179.922 శాతం నుంచి 191.226 శాతానికి పెంచనున్నారు. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 186.504 శాతం నుంచి 196.32 శాతానికి డీఏ పెరగనుంది. ఐదో జుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జుడీషియల్ అధికారుల డీఏ 200 శాతం నుంచి 212 శాతానికి పెరగనుంది. ఈ.పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జుడీషియల్ అధికారుల డీఏ 100 శాతం నుంచి 107 శాతానికి పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది. డీఏ బకాయిల వివరాలను నిర్ధారిత ప్రొఫార్మాలో ఉద్యోగులు సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పించాలని ఆర్థిక శాఖ సూచించింది. పెన్షనర్లకు కూడా ఈ మేరకు కరవు భృతి(డీఆర్) పెరగనుంది. పీఆర్సీ అమలు చేయాలి: ఉద్యోగులు ధరలు మండిపోతున్న నేపథ్యంలో సగటు వేతన జీవులు అల్లాడిపోతున్నారని, వెంటనే పదో పీఆర్సీని అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం 50 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కత్తి నరసింహారెడ్డి, ప్రధానకార్యదర్శి సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు కోరుతున్నారు.