The death of the farmer
-
బావిలో పడి రైతు మృతి
నంగునూరు(మెదక్ జిల్లా): నంగునూరు మండలం రాంపూర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి(30) అనే రైతు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ప్రమాదవశాత్తు మృతి చెందాడా, లేక ఎవరైనా కావాలని బావిలోకి తోశారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
మద్దూరు : పొలం వద్ద ఉన్న ఎస్ఎస్-3 ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గరై రైతు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా మద్దూరు మండలం మర్మాముల శివారు బంజరలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేచరేణి యాదగిరి (45) తన పొలంలో వరి సాగు చేసాడు. ఈ వారం రాత్రి 1 నుంచి ఉదయం 7 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ ఉంటుంది. మంగళవారం సరఫరా నిలిచిపోయి పంపులు నడవకపోవడంతో పక్క రైతులు రాత్రి 2 గంటలకు వచ్చి యూదగిరిని నిద్ర లేపారు. వారితో కలసి పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన యూదగిరి.. ఫ్యూజ్ వైర్ వేస్తుండగా షాక్‌కు గురై పడిపోయూడు. పక్కనున్న రైతులు వెంటనే చేర్యాల ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయకముందే బుధవారం ఉదయం 7 గంటలకు యూదగిరి మృతి చెందాడు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పులి రమేష్ తెలిపారు. -
‘మాఫీ’ కోసం తిరుగుతూ.. మృత్యుఒడిలోకి..
మెదక్ జిల్లాలో ఘటన వెల్దుర్తి: రుణమాఫీ కోసం కార్యాలయాల చుట్టూ నిత్యం కాళ్లరిగేలా తిరుగుతున్న ఓ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ ఆరెగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుష్కి రాములు(65) తనకున్న ఎకరంన్నర భూమి లో నీటి సౌకర్యం లేక హల్దీవాగు పరిసరాల్లో ఓ వ్యక్తికి చెందిన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. తన పొలంపై బ్యాంకులో రూ.65 వేలు రుణం పొందాడు. రుణమాఫీపై గురించి తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు రుణమాఫీ చేయాలంటే పహాణి సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడంతో ఈసేవ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ సర ్వర్లు డౌన్ అయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. ఇదిలా ఉండగా.. అధికారులు ఆహార భద్రతా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉండిపోయారు. రెండురోజులుగా తిండీ తిప్పలు లేకుండా అధికారుల చుట్టూ తిరిగాడు. అందులో భాగంగానే గురువారం కూడా రెవెన్యూ కార్యాలయానికి వచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో గ్రామానికి కాలినడకన బయలుదేరాడు. అయితే ఎలుకపల్లి రోడ్డు వద్దకు రాగానే సొమ్మసిల్లి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి నీరసించి చనిపోయాడని మృతుడి భార్య యశోద విలపించారు. కొత్త రుణాలకు మాత్రమే పహాణీలు అడిగామని, రుణమాఫీకి ఎలాంటి పత్రాలు అడగలేద సెంట్రల్ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్‌రావు అన్నారు.