నిద్రలో ఉండగా పొడిచి చంపారు
ముజఫర్ నగర్: నిద్ర పోతున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దిన్ మహ్మద్ (45) అనే వ్యక్తి గురువారం రాత్రి గాఢ నిద్రలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి కత్తులతో చొరబొడ్డారు. అయితే, అతడిని ఎందుకు చంపేశారనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. మరోపక్క, ఇదే ప్రాంతంలో కనిపించకుండా పోయిన ఓ యువకుడు శవమై తేలాడు. గత నెల రోజులుగా షామ్లీ జిల్లాలోని కాద్లా జిల్లాకు చెందిన అమిత్ కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోయి.. చివరికి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు.