25 నుంచి సామూహిక సత్యదేవ దీక్షలు
హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి
రాజమహేంద్రవరం కల్చరల్ :
రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేష¯ŒS (ఎస్ఐటీఏ) ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన గ్రామాల్లో హిందూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు జిల్లా కన్వీనర్ పవనగిరి స్వామి తెలిపారు. శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా సీతానగరంలో మూడు రోజులు జరిగిన గిరిజన, హరిజన, కోయదొర, కొండరెడ్ల, వాల్మీకి శాఖలకు చెందిన అర్చక శిక్షణ శిబిరానికి హాజరై తిరిగి వెడుతున్న ఆయన శనివారం రాజమహేంద్రవరం వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ సూచనల మేరకు ఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి అడ్డతీగల గ్రామంలోని పవనగిరిపై తొలివిడత సామూహిక సత్యదేవుని దీక్షలు ప్రారంభమవుతాయన్నారు. దీక్షావస్రా్తలు, ఇతర సామగ్రిని అన్నవరం దేవస్థానం అందజేస్తుందన్నారు. గిరిజన గ్రామాలు, దళిత వాడల్లో 500 ఆలయాలను నిర్మించడానికి దేవాదాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోందన్నారు. ఆలయాల నిర్మాణం కోసం టీటీడీ ఇప్పటికి రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో అడ్డతీగలలోని పవనగిరిపై నిర్మించిన ఋషిపీఠం కల్యాణమండపంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.