deekshita
-
గైనకాలజిస్ట్ కావాలన్నదే లక్ష్యం
-
భారత జట్టులో వరుణ్, దీక్షిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన యువ వెయిట్‌లిఫ్టర్లు వరుణ్, దీక్షితలు ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపికయ్యారు. నేపాల్‌లోని ఖాట్మండులో జూలై 21 నుంచి 29 వరకు ఈ పోటీలు జరుగుతాయి. వరుణ్ 77 కేజీల విభాగంలో, దీక్షిత 58 కేజీల విభాగంలో పోటీపడతారు. ఈ సందర్భంగా ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి వీరిని అభినందించారు. మన రాష్ట్రం నుంచి ఇద్దరు వెయిట్ లిఫ్టర్లు ఒకేసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వరుణ్, దీక్షితలా మరింత మంది క్రీడాకారులు దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
చెస్ చాంపియన్ దీక్షిత
సాక్షి, హైదరాబాద్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రంగారెడ్డి జిల్లా చెస్ టోర్నమెంట్లో దీక్షిత విజేతగా నిలిచింది. కుషాయిగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం జరిగిన టోర్నమెంట్లో అండర్-17 బాలికల విభాగంలో దీక్షిత (రవీంద్ర భారతి) 5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. బాలుర విభాగంలో జయంత్ (6, డీఏవీ), ప్రతీక్ (5.5, డీఏవీ), రోహిత్ (5, టీవీఆర్ మోడల్)లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండ ర్ -14 బాలికల విభాగంలో నందిత (5) మొదటి స్థానంలో నిలవగా... చేతన (5, సెయింట్ ఆండ్రూస్), మాధురి (4, డీఏవీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.