Deen Raj
-
బూట్లలో ఉప్పు వేసుకొని అక్కడ షూటింగ్ చేశాం: ఢైరెక్టర్
చైనా బోర్డర్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి భారతీయన్స్ సినిమా షూటింగ్ చేశాం. వర్షాలు కురిసి, కొండచరియలు విరిగిపడి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం. జీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ‘శ్మీర్ ఫైల్స్ ’దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘భార తీయన్స్’ చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది’ అని ప్రముఖ రచయిత దీనరాజ్ అన్నారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా వంటి సూపర్‌హిట్ చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన దీనరాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► భారతీయన్స్ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. డ్రోన్స్‌తో షూట్ చేయడానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడవుల్లో షూటింగ్‌కు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నాం.ఒక్కోసారి మధ్యాహ్నం 2 గంటలకే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయలేకపోయేవాళ్ళం. చిత్ర యూనిట్ సభ్యులకు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ సరిపడకపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. కొండచరియలతోపాటు.. చెట్లు విరిగి మా కార్లమీద పడడంతో కొందరు యూనిట్ సభ్యులు బతుకు జీవుడా అని దొరికిన వాహనాన్ని పట్టుకుని హైదరాబాద్ వచ్చేశారు. ► అడవుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు జలగలు మా కాళ్లని పట్టుకుని సైలెంట్‌గా రక్తాన్ని పీల్చేవి. సమీప గ్రామాల నుంచి ఉప్పు బస్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్లలో ఉప్పు వేసుకుని షూటింగ్ కొనసాగించాం. సిక్కిం, సిలిగురి అడవుల్లో దోమల్లాంటి కీటకాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌గా వాలి రక్తాన్ని పీల్చేవి. యాక్షన్ అని డైరెక్టర్ అనగానే ఆర్టిస్టులు చేతులతో ఆ కీటకాలను తోలుకుంటూ ఉండేవారు ► క్లైమాక్స్ కోసం కొండల మధ్యలో ఉన్న ఒక లోయను ఎన్నుకున్నాం. ప్రతిరోజూ వేకువజామున 3.30కే బయల్దేరి మూడు గంటలపాటు కొండల మధ్య ప్రయాణం చేసి ఆ లోయను చేరుకునేవాళ్ళం. ఎన్ని కష్టాలు పడితే ఏంటి? తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుదల కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. -
‘భారతీయన్స్’ టీజర్ బాగుంది: సురేశ్ బాబు
ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) దీన్ రాజ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్’. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత నిర్మించారు. (చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్) తాజాగా ఈ చిత్రం టీజర్‌ని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ సంస్థకు "ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా" వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న "భారతీయన్స్" బిగ్గెస్ట్ బ్లస్టర్ కావాలని ఆకాంక్షించారు. (చదవండి: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!) దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ ''దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి ప్రశంసలు అందుకున్న మా చిత్రం టీజర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది'అని అన్నారు. హీరో నీరోజ్ మాట్లాడుతూ ''హీరోగా నాకు ఫస్ట్ సినిమా ఇది. అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్ గారికి, దర్శకులు దీన్ రాజ్ గారికి థాంక్స్'' అని అన్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సత్య కశ్యప్ & కపిల్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.