ఏడాది చిన్నారిపై పైశాచికం
హైదరాబాద్: అభం శుభం తెలియని ఏడాది చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన నగరంలోని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న దీప్సింగ్ ఇంటి పక్కనే నివాసముంటున్న ఏడాది పాపపై అత్యాచారం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.