అస్వస్థతతో విద్యార్థిని మృతి
ధర్మసాగర్ : అస్వస్థతకు గురై విద్యార్థిని మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కాయిత లావణ్య (12) మల్లక్పల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. శుక్రవారం లావణ్య వాంతులు, తల నొప్పితో భాధపడటంతో కుటుంబసభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొం దుతూ మృతి చెందింది.
కాగా నులిపురుగుల నివారణకు ఈనెల 10న వేసుకున్న మాత్రలు వికటించటంతోనేతమ కూతురు మృతి చెందిం దని తల్లిదండ్రులు ఆరోపించారు.