Delhi dare davils
-
ఢిల్లీ డేర్‌డెవిల్స్ కాదంట..
సాక్షి, న్యూఢిల్లీ: సారథులను, కోచ్‌లను, ఆటగాళ్లను మార్చినా విజయాలు దక్కటం లేదని ఏకంగా జట్టు పేరును, లోగోను మార్చేసింది ఐపీఎల్‌లోని ఢిల్లీ ఫ్రాంఛైజీ. ఐపీఎల్ సీజన్ 12 కోసం సమయాత్తమవుతున్న అన్ని ఫ్రాంఛైజీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దానిలో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరు, లోగో మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌గా కొత్త నామకరణం చేస్తూ లోగోనూ అవిష్కరించింది. 2019 సీజన్లోనైనా ట్రోఫీ నెగ్గాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీలో వాటాలు కొనుగోలు చేసిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ జట్టులో సమూల మార్పులు చేస్తోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా.. మహ్మద్ కైఫ్ సహాయకుడిగా నియమించింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. గంభీర్ వచ్చినా.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఢిల్లీకి గౌతమ్ గంభీర్ నాయకత్వం వహించాడు. అయితే జట్టు పరాజయాలకు బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ యువజట్టు ఊహించని రీతిలో రాణించినా విజయాలు మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 18వ తేదీన జైపూర్‌లో జరుగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో 70 మంది క్రికెటర్లను వేలం పాడనున్నారు. వీరిలో 50 మంది భారత క్రికెటర్లు, 20 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నట్లు సమాచారం.ఇక ఇప్పటికే గౌతమ్ గంభీర్‌తో సహా పదిమంది ఆటగాళ్లను ఢిల్లీ రిలీజ్ చేసింది. -
తట్టుకోలేనంత సంతోషంలో ప్రీతి జింతా!
మొహాలి : ఐపీఎల్-11 సీజన్లో కింగ్స్ఎలెవన్ పంజాబ్ శుభారంభం చేయడంతో ఆ జట్టు సహయజమాని ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీడేర్ డెవిల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డుకు తోడు కరుణ్ నాయర్ మెరవడంతో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ప్రీతి జింతా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘నూతన సారథి అశ్విన్ నాయకత్వంలో కేఎల్ రాహుల్ రికార్డు నమోదు, ఐపీఎల్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ ఉర్ రహ్మాన్, కరుణ్ నాయర్ ప్యాక్స్ పంచ్‌లతో మ్యాచ్ ఆసాంతం నా నవ్వును ఆపుకోలేకపోయాను’ టింగ్! అని ఈ స్టార్ ఆటగాళ్లతో దిగిన ఫొటోను షేర్ చేసింది ఈ సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ట్వీట్ పంజాబ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ ఆటగాళ్లు రెండు రికార్డులు నమోదు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. దీంతో ఇప్పటివరకూ యూసఫ్ పఠాన్, సునీల్ నరైన్ పేరిట సంయుక్తంగా ఉన్న 15 బంతుల ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్ధలైంది. ఇక 17 ఏళ్ల 11 రోజుల వయసుతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ముజీబ్ ఉర్ రహ్మాన్ ఘనత సాధించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు 17 ఏళ్ల 177 రోజుల వయసులో బెంగళూరు తరఫున అరంగ్రేటం చేసిన సర్ఫరాజ్ ఖాన్ పేరిట ఉండేది. When @ashwinravi99 leads, @klrahul11 sets a new record, @Mujeeb_Zadran debuts at 17, @karun126 packs a punch & I can’t stop smiling 😃 #ting😘 pic.twitter.com/9DZZX9XwK0 — Preity zinta (@realpreityzinta) 9 April 2018 -
ద్రవిడ్ శిక్షణలో రాటుదేలుతా: బిల్లింగ్స్
పుణే: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తన బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని ఇంగ్లండ్ కీపర్, బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్ నుంచి బిల్లింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిలో ఆడటం మెరుగైనట్లు బిల్లింగ్స్ పేర్కొన్నాడు. ఢిల్లీ మెంటర్ రాహుల్ ద్రవిడ్, కోచ్ ప్యాడి ఆప్టన్ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్ తెలిపాడు. వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్న జట్టు అని , కానీ తొలి మ్యాచ్ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్ తెలిపాడు. ఐపీఎల్లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని చెప్పాడు. కాకపోతే వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటందన్నాడు. ఢిల్లీలో కేవలం పేస్ బౌలింగ్ కాకుండా మంచి స్పిన్నర్లు జయంత్ యాదవ్, నదీమ్‌లు ఉన్నారని బిల్లింగ్స్ వ్యాఖ్యానించాడు. -
బెంగళూరు బ్యాటింగ్
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ షేన్ వాట్సన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన గత మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరొకవైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ టోర్నీని విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆర్సీబీ తుది జట్టు; షేన్ వాట్సన్(కెప్టెన్), క్రిస్ గేల్, మన్ దీప్ సింగ్, కేదర్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ,విష్ణు వినోద్, పవన్ నేగీ,చాహల్, తైమాల్ మిల్స్, ఇక్బాల్ అబ్దుల్లా, స్టాన్ లేక్ ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), శ్యామ్ బిల్లింగ్స్, సంజూ శాంసన్ఆదిత్య తారే, కరుణ్ నాయర్,రిషబ్ పంత్, కార్లోస్ బ్రాత్ వైట్, క్రిస్ మోరిస్, ప్యాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్