బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ షేన్ వాట్సన్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన గత మ్యాచ్ లో ఓడిపోయిన ఆర్సీబీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. మరొకవైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ టోర్నీని విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు పటిష్టంగా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఆర్సీబీ తుది జట్టు; షేన్ వాట్సన్(కెప్టెన్), క్రిస్ గేల్, మన్ దీప్ సింగ్, కేదర్ జాదవ్, స్టువర్ట్ బిన్నీ,విష్ణు వినోద్, పవన్ నేగీ,చాహల్, తైమాల్ మిల్స్, ఇక్బాల్ అబ్దుల్లా, స్టాన్ లేక్
ఢిల్లీ తుది జట్టు: జహీర్ ఖాన్(కెప్టెన్), శ్యామ్ బిల్లింగ్స్, సంజూ శాంసన్ఆదిత్య తారే, కరుణ్ నాయర్,రిషబ్ పంత్, కార్లోస్ బ్రాత్ వైట్, క్రిస్ మోరిస్, ప్యాట్ కమిన్స్, అమిత్ మిశ్రా, నదీమ్
బెంగళూరు బ్యాటింగ్
Published Sat, Apr 8 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
Advertisement
Advertisement