ఆర్సీబీ-సన్ రైజర్స్ మ్యాచ్ రద్దు | RCB vs Sunrisers match called off due to rain | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ-సన్ రైజర్స్ మ్యాచ్ రద్దు

Published Tue, Apr 25 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

ఆర్సీబీ-సన్ రైజర్స్ మ్యాచ్ రద్దు

ఆర్సీబీ-సన్ రైజర్స్ మ్యాచ్ రద్దు

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా మంగళవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సి ఉన్న మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. బెంగళూరులో ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షం పడటంతో మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. మ్యాచ్ ను జరిపేందుకు శతవిధాలా యత్నించినా వర్షం ఎంతసేపటికి విరామం ఇవ్వలేదు. చివరకు ఐదు ఓవర్ల షూటౌట్ కూడా సాధ్యం కాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు రాత్రి గం.11.00 సమయంలో అంపైర్లు ప్రకటించారు. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగ్గా.. వర్షం వల్ల తొలిసారి ఓ మ్యాచ్ రద్దు కావడం కూడా ఆ జట్ల మధ్య కావడం గమనార్హం. అంతకు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement