గెలుపెవరిది..?
►నేడు బెంగళూరుతో తలపడనున్న హైదరాబాద్
►గెలవాలనే కసితో సన్‌రైజర్స్
►తీవ్ర ఒత్తిడిలో బెంగళూరు
బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్‌కతా చేతిలో ఎదురైన పరాభవంతో ఉక్కిరిబిక్కిరైంది. దీంతో మంగళవారం హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఖచ్చితంగా నెగ్గాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండటంఆ జట్టుకు కొంత ఊరట కలిగించే విషయమే. ఆదివారం కోల్‌కతాతో బెంగళూరు 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కోల్‌కతాను 131 పరుగులకు కుప్పకూల్చిన బెంగళూరు ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్, జాదవ్, మన్‌దీప్‌లతో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న బెంగళూరు 49 పరుగులకే ఆలౌట్ అయి ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్‌తో బెంగళూరు తలపడనుంది
బెంగళూరు డీలా...
బెంగళూరు జట్టులో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా ఆ జట్టు డీలా పడిపోతోంది. ముఖ్యంగా టాపార్డర్‌పైనే వారి బ్యాటింగ్ ఆధారపడి ఉంది. దీంతో టాపార్డర్ పెవిలియన్‌కు చేరిన వెంటనే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు కూడా వారిని అనుసరిస్తున్నారు. జట్టులో విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్‌లో మెరిశాడు. ఈ సీజన్‌లో తన స్థాయిలో ఆడటం లేదు. విరాట్ కోహ్లి, డివిలియర్స్‌లు తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. కేదార్ జాదవ్ పర్వాలేదనిపిస్తున్నా... మన్‌దీప్‌సింగ్, పవన్‌నేగి, బిన్నీలు అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రస్తుతం బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ జట్టు ప్రదర్శన ఇలాగే కొనసాగితే ఇక ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గాలని ఆ జట్టు భావిస్తోంది.
ఓడుతూ.. గెలుస్తూ...
హైదరాబాద్ జట్టు అప్పుడప్పుడు ఓడుతున్నా కీలక సమయాల్లో గెలుస్తూ వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూండటం తో విజయాలను దక్కించుకుంటున్నారు. ఇక బ్యాటింగ్‌లో జట్టు కెప్టెన్ వార్నర్ రాణిస్తున్నా మిగతా బ్యాట్స్‌మెన్‌ల నుంచి అంతగా సహకారం లభిం చడం లేదు. ముఖ్యంగా∙యువరాజ్‌సింగ్ ప్రభావం చూపెట్టలేకపోతున్నాడు. నమన్ ఒజా, హుడాలు స్వేచ్ఛగా బ్యాట్ ఝులుపించలేకపోతున్నారు. జట్టు కష్టా ల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు రాణిస్తుండటంతో వారు గెలుపు బాట పడుతున్నారు.