హస్తినలో అత్యాచారం .. మధురలో నిందితుడు
న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో శుక్రవారం రాత్రి అత్యాచారానికి గురైన యువతి (27) కేసును న్యూఢిల్లీ పోలీసులు ఆదివారం ఛేదించారు. క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ను పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని న్యూఢిల్లీకి తీసుకు వస్తున్నారు. దేశ రాజధాని హస్తినలో అత్యాచారినికి గురైన యువతి కేసులో క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో నిందితుడిని అదుపులోకి తీసుకుని న్యూఢిల్లీకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. బాధితురాలు గుర్గావ్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తుంది.
శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ప్రెండ్స్‌తో పార్టీకి వెళ్లి... బాగా పొద్దుపోయిన తర్వాత ఒంటరిగా క్యాబ్‌లో ఇంటికి బయలుదేరింది. ఆ క్రమంలో నిద్రలోకి జారుకుంది. ఆ విషయం గమనించిన క్యాబ్ డ్రైవర్... కారును నిర్మానుష్య ప్రాంతానికి తరలించాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అతడిని ప్రతిఘటించి... కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని ఆమెపై దాడికి దిగాడు. ఆమెపై అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారైయ్యాడు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితుడు మధురలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.