నేపాల్లో మరో భూకంపం.. ఢిల్లీలో కూడా
ఖాట్మండు: నేపాల్లో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి వారంతా మరోసారి తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. అమెరికా భూగర్భ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇది సంభవించినట్లు తెలిపారు. మరోపక్క, నేపాల్ లో తాజా ప్రకంపనల అనంతరం భారత రాజధాని ఢిల్లీని కూడా భూప్రకంపనలు చుట్టుముట్టాయి.
ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలంతా భయాందోళనలతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి. స్వల్ప విద్యుత్ అంతరాయం కూడా చోటుచేసుకుంది. ఉత్తర భారత మంతా కూడా కంపించిపోయింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాలు కూడా ప్రకంపనల బారిన పడ్డాయి.