delhi weather
-
భయపెడుతున్న పొగమంచు.. తెలుగు రాష్ట్రాలకూ అలర్ట్
ఎముకలు కొరికే చలి దేశాన్ని గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు (Dense Fog) పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. దట్టంగా వ్యాపిస్తుండడంతో చాలా చోట్ల ఉదయం 10-11 గంటల దాకా కూడా రాత్రిని తలపిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై పెను ప్రభావం పడుతోంది. ఇక.. శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు దట్టంగా కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు గాలి నాణ్యత కూడా పడిపోయింది. మరోవైపు పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడాల్సి వస్తోంది. పొగమంచు దట్టంగా పేరుకుపోయి.. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. వీళ్లు జాగ్రత్త! ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండడంతో.. సీజనల్ డిసీజ్‌లు వ్యాపించే అవకాశాలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, ఆస్తమా తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్లు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకునే అవకాశాలు ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణశాఖ సూచించింది. రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో మంచు కురవొచ్చని అంచనా వేస్తోంది. -
Delhi: ఈదురుగాలుల భారీ వర్షం.. ఢిల్లీ అతలాకుతలం
ఢిల్లీ: భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షంతో దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. సోమవారం వేకువ ఝామున మొదలైన వరణుడి ప్రతాపం.. నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది. ఢిల్లీ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి చాలాచోట్ల. దీంతో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. దీంతో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. గంటలకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. We do not have that option, but those who do, may consider exercising the option to work from home. Meanwhile, Gurgaon Police is on the roads to assist you ….@gurgaonpolice pic.twitter.com/A7utm7XSjs — Gurugram Traffic Police (@TrafficGGM) May 23, 2022 వాతావరణంలో ప్రతికూల ప్రభావంతో.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. ప్రయాణికులు.. ముందుగానే స్టేటస్‌ను పరిశీలించుకుని ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకోవాలని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు సూచిస్తున్నారు. Due to bad weather, flight operations at @DelhiAirport are affected. Passengers are requested to get in touch with the airline concerned for updated flight information. #BadWeather #Rain — Delhi Airport (@DelhiAirport) May 23, 2022 ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో రాబోయే గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం పడొచ్చని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా చోట్ల ఇళ్లు సైతం దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో పాత భవనాలపై పిడుగుల ప్రభావం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వాతావరణం చల్లబడటం ఊరట ఇచ్చినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నష్టంపైనా అధికారులు అంచనాకి వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. Traffic Alert: Water logging has been reported near Bakhtawar chowk . Our traffic officials are on the spot to facilitate the traffic flow. Commuters are requested to plan their travel accordingly. @gurgaonpolice pic.twitter.com/pla6DhqgmB — Gurugram Traffic Police (@TrafficGGM) May 23, 2022 #WATCH | Haryana: Several parts of Gurugram face waterlogging following the rainfall this morning. pic.twitter.com/4TloM8TIrF — ANI (@ANI) May 23, 2022 -
ఇప్పుడు ఢిల్లీ వంతు.. కూలిన హోర్డింగ్!
దేశ రాజధానిలో వాతావరణం సోమవారం ఉన్నట్టుండి మారిపోయింది. విపరీతమైన గాలి దుమ్ము లేచింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. దాంతో ఒక హోర్డింగ్ కుప్పకూలి.. ఓ వ్యక్తి మరణించగా ఇద్దరు గాయపడ్డారు. అయితే ఆదివారం 41 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత మాత్రం ఒక్కసారిగా 8 డిగ్రీలు తగ్గి 33 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మధ్యదరా సముద్రంలో మొదలైన వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగానే ఇలా జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాని కారణంగా పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో వర్షం లేదా మంచు పడతాయని, దాంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు. మంగళవారం కూడా ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని, అక్కడక్కడ వర్షాలు కూడా పడతాయని ప్రైవేటు వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ చెప్పారు. అయితే బుధవారం నుంచి మాత్రం మళ్లీ పరిస్థితి మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, పొడిగాలులు వీస్తాయని తెలిపారు.