విరసం నేతల అరెస్టు
ఘట్కేసర్ : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం కేపాల్ వద్ద విరసం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్లో ఓ మీటింగ్కు బయలు దేరిన విరసం నేత వరవరరావు, పౌరహక్కులనేత హరగోపాల్, ఆయన సతీమణి వనమాలినిని అడ్డుకున్నారు. మీటింగ్కు పర్మిషన్ ఉన్నా పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.