పోలీసుల పాత్ర కీలకం
కేతేపల్లి : ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నా రు. కేతేపల్లిలో రూ.68 లక్షల వ్యం యంతో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని విద్యాశాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయనమా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భ ద్రతలనలు పరిరక్షించి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పోలీసుల పైనే ఉందన్నారు.పోలీసు వ్యవస్థ భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు.
ఆర్బీఐ ఎన్ని అడ్డంకులు సృస్టిం చినా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన మేరకు రుణమాఫీని అమలు చేస్తామన్నారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదేసే అధికారం ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉందన్నారు. అయితే ప్రభుత్వానికి కొంత సమ యం ఇవ్వాలనే కనీస ధర్మాన్ని పాటించకుండా ప్రతిపక్ష పార్టీలు తమపై విమర్శలకు దిగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ పాంట్లు ఏర్పాటు చేయటంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే కొత్త రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిం దని తెలిపారు. విద్యుత్ కొరతపై రైతులు ఎక్కడైనా ఆందోళనలు చేస్తే పోలీసులు వారిపై లాఠీ ఛార్జీలు చేయకుండా సంయమనంతో ఉండాలని సూచించారు.
అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని హోంమంత్రి ప్రారంభించారు. అంతకు ముందు రాష్ట్ర మంత్రులకు పోలీసులు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు గోవర్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, జిల్లా కలెక్టర్ టి.చిరంజీవి, హైద్రాబాద్ డీఐజీ పీవీ.శశిధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, అడిషినల్ ఎస్పీ రమారాజేశ్వరి, డీఎస్పీ రామ్మోహన్రావు, సీఐ ప్రవీ ణకుమార్, ఎస్ఐ ఎ.శ్రీనివాస్, జెట్పీటీసీ లక్ష్మమ్మ, ఎంపీపీ, మంజుల, కేతేపల్లి -2 ఎంపీటీసీ సునీత ఉన్నారు.