పేలుళ్ల నిందితుడికి బెయిల్ నిరాకరణ
హైదరాబాద్: హైదరాబాద్ వరుస పేలుళ్ల కేసు నిందితుడికి హైకోర్టులో చుక్కెదురైంది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల సంఘటనల్లో నిందితుడు ఫరూక్ షర్పొద్దీన్ తర్కాష్ల అలియాస్ అబ్దుల్లాకు బెయిల్ ఇవ్వడానికి గురువారం హైకోర్టు నిరాకరించింది.
2007 ఆగస్టు 25న ... లుంబినీపార్క్, గోకుల్ చాట్ ప్రాంతాల్లో ఏకకాలంలో పేలుళ్లు సంబవించిన విషయం తెలిసిందే. ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో అక్కడికక్కడే 17 మంది చనిపోగా 80 వరకు గాయపడ్డారు.