ప్యాంట్ విత్ లేస్...
డెనిమ్ ప్యాంట్స్ నేటి అమ్మాయిల ఫేవరేట్. వార్డ్‌రోబ్‌లో తప్పక చేరుతున్న క్యాజువల్ వేర్. దీనిని స్టైల్‌గా, స్పెషల్ అనిపించేలా తీర్చిదిద్దాలంటే సింపుల్ అనిపించే ఓ చిన్న ఐడియాను ఆచరణలో పెట్టేయడమే. అదేంటో ఫొటోలో చూస్తే తెలిసిపోతుంది కదా! ఒకవైపు ప్యాంట్‌ని కట్ చేసి దానికి లేస్ డిజైన్ని జత చేయండి. స్టైల్ ప్యాంట్ ఇలా మీ ముందు రెడీ!
స్టెప్ 1: బ్లాక్, వైట్.. లేస్ డిజైన్, రంగు ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ప్యాంట్‌కి ఏ భాగంలో లేస్ జత చేయాలో సరిచూసుకోవాలి. అందుకు మోకాలు, థైస్, పాకెట్, ఫుల్ లె గ్ లెంగ్త్.. మార్క్ చేసిన చోటే ప్యాంట్‌ను కట్‌చేయాలి. ముందే ఎంచుకున్న కాంబినేషన్ లేస్‌ను ప్యాంట్‌కి జత చేసి కుట్టాలి. దీంతో చూడముచ్చటైన లేస్ డెనిమ్ ప్యాంట్ రెడీ అవుతుంది.
స్టెప్ 2: ప్యాంట్‌ను కట్ చేయాల్సిన అవసరం లేకుండా పై నుంచి లేస్ డిజైన్‌ను వేయాలనుకున్నవారు ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఫ్లోరల్ ప్రింట్లు ఉన్న లేస్ డిజైన్స్ ఎంచుకోవాలి. ఎంత లెంగ్త్, ఏయే భాగంలో లేస్ వేయాలో మార్క్ చేసుకొని ఆ ప్రకారం లేస్‌ను గమ్‌తో అతికించాలి. తర్వాత కుట్లు వేయాలి.
స్టెప్ 3: పొట్టివైన ప్యాంట్లకు అడుగు భాగాన లేస్‌ను జతచేయ వచ్చు. అలాగే డెనిమ్ కెప్రీస్, షార్ట్స్‌కు లేస్ జత చేస్తే ఓ కొత్త స్టైల్ ప్యాంట్ స్పెషల్వేర్గా మీ ముందు ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతుంది.