మహిళా డెంటిస్ట్‌ను వేధించిన ఆకతాయి
మహబూబాబాద్‌లో రైల్వే పోలీసుల తనిఖీ
మట్టెవాడ : రైలులో ప్రయాణిస్తున్న మహళా డెంటిస్ట్‌ను ఓ ఆకతారుు ప్రయాణికుడు వేధించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై గోవర్దన్, డోర్నకల్ ఎస్సై దేవేందర్, ఆర్పీఎఫ్ సీఐ హరిబాబు కథనం ప్రకారం కేరళ నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో బీ-3 కోచ్‌లోని 46వ సీటులో కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన ఎంజీఆర్ హాస్పిటల్ డెంటిస్ట్ టిన్సీ మీనన్ ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తమిళనాడులోని సేలం వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు టిన్సీ దగ్గర కూర్చోవడం, అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో టిన్సీ ఎంచేయాలో తోచలేదు..వ ెంటనే దుబాయిలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసింది. అతను సంబంధిత రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. మహబూబాబాద్‌లో రైలు ఆపి ఆకతారుు కోసం తనిఖీ చేశారు. దీంతో మహబూబాబాద్ స్టేషనలో రైలు రెండు నిమిషాలు ఆగింది. కానీ, సదరు ఆకతారుు విజయవాడలోనే దూకి పారిపోరుునట్లు రైల్వే గార్డు పోలీసులకు తెలపగా రైలును పునరుద్ధరించారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించి వరంగల్ రైల్వే స్టేషన్లో టిన్సీని పోలీసులు విచారించారు.ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. టిన్సీని వేధించిన ప్రయాణికుడు కేరళలోని అలువా ప్రాంతానికి చెందిన ఎల్. రాజు అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.